సకుటుంబంగా ఎంజాయ్‌ చేస్తున్నారు

Kushiవిజయ్‌ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషి’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ప్రేమను ఏకగ్రీవంగా పొందుతున్న నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్‌ మీట్‌ను ఏర్పాటు చేసింది. నిర్మాతలు మాట్లాడుతూ, ‘ఈ సినిమాను ప్రేక్షకులు యూనానిమస్‌గా సూపర్‌హిట్‌ చేశారు. ఎర్లీ మార్నింగ్‌ నుంచి యూఎస్‌ కాల్స్‌ వస్తున్నాయి. సినిమా ఘన విజయం అందుకుందని చెబుతున్నారు. ఫ్యామిలీ, యూత్‌ ఆడియెన్స్‌ అందరూ ఖుషి మూవీని ఎంజాయ్‌ చేస్తున్నారు. విజరు కెరీర్‌లో బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్‌ వచ్చాయి. డిస్ట్రిబ్యూటర్స్‌ కంటి న్యూస్‌గా కాల్స్‌ చేస్తున్నారు. షో బై షో కలెక్షన్స్‌ పెరుగు తున్నాయని రిపోర్ట్‌ ఇస్తున్నారు. ఇది ఇంకా ఎంత పెద్ద రేంజ్‌కు వెళ్లుందో మరికొద్ది రోజుల్లో చెబుతాం. వెరీ క్లీన్‌ మూవీ. ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమా రాలేదు. మంచి మూవీ కాబట్టి అవార్డ్స్‌ కు కూడా అవకాశం ఉంది’ అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ, ‘ఖుషి సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్‌ చూస్తుంటే సంతోషంగా ఉంది. దేవుడు, నమ్మకాలు, కర్మ సిద్ధాంతం అనేది మన దేశంలో వందల ఏళ్ల క్రితం నుంచి ఉంది. ఈ నేపథ్యంతో బ్యూటి ఫుల్‌ లవ్‌ స్టోరీని ఇప్పుడున్న సొసైటీకి చెప్పాలనుకుని ఈ కథ రాసుకున్నాను. ఆ పాయింట్‌కు ప్రేక్షకులు కనెక్ట్‌ అవుతున్నారు. ఎవరు ఏది నమ్మినా నమ్మకున్నా ప్రేమించే మనుషులతో కలిసి ఉండాలని చెప్పాం’ అని అన్నారు.

Spread the love