ఉత్సాహంగా ఉమ్మడి జిల్లా..ఎస్‌జీఎఫ్‌ కరాటే ఎంపికలు

మహబూబ్‌ నగర్‌: రాష్ట్రస్థాయి స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు ప్రతిభచాటి పతకాలు సాధించాలని జిల్లా ఎస్‌ జి ఎఫ్‌ కార్యనిర్వాహక కార్యదర్శి రమేశ్‌ బాబు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాల ఆవరణలో కరాటే మాస్టర్‌ ఎస్‌ కే.మోసీన్‌ అధ్వర్యంలో ఆదివారం ఉమ్మడి జిల్లా అండర్‌-14, అండర్‌-17 స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ కరాటే ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా రమేశ్‌ బాబు మాట్లాడుతూ కరాటే పోటీల్లో రాణించాలని కోరారు. నేడు (సోమవారం) నల్గొండ జిల్లాలో రాష్ట్రస్థాయి ఎస్‌ జి ఎఫ్‌ కరాటే పోటీలు జరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ జి ఎఫ్‌ సహాయ కార్యదర్శి వేణుగోపాల్‌, జిల్లా రగ్బీ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి నిరంజన్‌ రావు, కరాటే మాస్టర్లు అమ్రేష్‌, రవి, కష్ణ, మోసిన్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love