మార్చి 10 న ప్రవేశ పరీక్ష

నవతెలంగాణ – సిద్దిపేట
గ్రూప్స్ పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మార్చి 10న స్థానిక ప్రతిభ డిగ్రీ కళాశాలలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందని జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారిని  కవిత , స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. శుక్రవారం వారు మాట్లాడుతూ tsstudycircle.cgg.gov.in లో డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే ముందు ఏవైనా రెండు సమాచారాలను మాత్రమే నింపి మీ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా వందమంది అభ్యర్థులకు సీట్లు కేటాయించబడతాయని,  ఇందులో ఎస్సీలకు 75, బీసీలకు 15, ఎస్టిలకు 10 శాతం సీట్లు కేటాయించబడతాయని తెలిపారు. ఈనెల 18 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని తెలిపారు.
Spread the love