– రెండు దశాబ్దాల పాలన పొడిగింపు
ఇస్తాంబుల్ : టర్కీ అధ్యక్షులుగా రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ మరోసారి ఎన్నికయ్యారు. దీంతో టీర్కిలో గత 20 ఏళ్లగా కొనసాగుతున్న ఎర్డోగన్ పాలనకు పొడిగింపు లభించినట్లయింది. చివరి విడత కౌంటింగ్‌లో ఎర్డోగన్‌కు 52 శాతం ఓట్లు లభించినట్లు అధికారులు తెలిపారు. ప్రత్యర్థి కెమల్ కిలిక్‌డరోగ్లుకు 48 శాతం ఓట్లు లభించాయని తెలిపారు. ఆదివారం రాత్రి ఈ ఫలితాలు విడుదల చేశారు.