భారీ మెజార్టీతో గెలుస్తాం: ఎర్రబెల్లి దయాకర్ రావు

– పలువురు బీఆర్ఎస్ లో చేరికలు
నవతెలంగాణ -పెద్దవంగర: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో కంటే రికార్డు మెజారిటీతో గెలుస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మంగళవారం బొమ్మకల్లు గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు కేతిరెడ్డి సోమనర్సింహా రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు బానోత్ రవీందర్ నాయక్, మాజీ జెడ్పీటీసీ జాటోత్ కమలాకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి మంత్రి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..పాలకుర్తి నియోజకవర్గంలో నేను చేసిన అభివృద్ధి పనులే తనను భారీ మెజార్టీతో గెలిపిస్తాయని అన్నారు. ప్రతి ఇంటికి కేసీఆర్ సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు బీఆర్ఎస్ మేనిఫెస్టో భరోసా కల్పిస్తుందని చెప్పారు. బూత్ స్థాయిలో కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు రెడ్డెబోయిన గంగాధర్ యాదవ్, గిరగాని రవి, ఎరసాని సమ్మయ్య, ఎరసాని రాంమూర్తి, గంగారపు పెద్ద వెంకన్న, గంగారపు వెంకన్న, సుమంత్, రాజేష్, వెంకన్న, యాకన్న, సోమయ్య, ద్రావిడ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love