సరికొత్త కథతో పరారీ

యోగేశ్వర్‌, అతిధి జంటగా సాయిశివాజీ దర్శకత్వంలో జివివి గిరి నిర్మించిన చిత్రం ‘పరారీ’. శ్రీ శంకర ఆర్ట్స్‌ బ్యానర్‌ పతాకంపై గాలి ప్రత్యూష సమర్పణలో, నిర్మితమవుతున్న ఈ చిత్రం ఈనెల 30న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ అవుతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌లో కాంగ్రెస్‌ లీడర్‌ అంజన్‌ కుమార్‌ యాదవ్‌, సుమన్‌, ప్రసన్న కుమార్‌ థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేయగా, దర్శకులు చంద్ర మహేష్‌, నిర్మాత తుమ్మల పల్లి రామసత్యనారాయణ, ప్రతాని రామకష్ణగౌడ్‌ థియేట్రికల్‌ ప్రోమోను రిలీజ్‌ చేశారు. నటి కవిత సాంగ్‌ ప్రోమోను విడుదల చేశారు. ఇదే వేడుకలో హీరో యోగేశ్వర్‌ బర్త్‌ డే సెలెబ్రేషన్‌ను గ్రాండ్‌గా జరిపి చిత్ర బృందం కేక్‌ కట్‌ చేసింది. ఈ సందర్భంగా సుమన్‌ మాట్లాడుతూ, ‘సినిమా చాలా బాగా వచ్చింది. హీరో యోగేష్‌ చాలా బాగా నటించాడు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు మంచి సినిమా చూశామనే ఫీలింగ్‌ కలుగుతుంది’ అని తెలిపారు. ‘చక్రి తమ్ముడు మహిత్‌ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. సుమన్‌ ఈ మూవీలో మంచి క్యారెక్టర్‌ చేశారు. ఈ సినిమా మంచి కథ, కథనాలతో అందరిని మెప్పిస్తుందనే నమ్మకం ఉంది’ అని నిర్మాత జి.వి.వి.గిరి చెప్పారు. సంగీత దర్శకుడు మహిత్‌ నారాయణ్‌ మాట్లాడుతూ, ‘ఇందులో సాంగ్స్‌ చాలా బాగా వచ్చాయి. ఈ సినిమాతో నాకు మంచి పేరు వస్తుంది’ అని తెలిపారు. ‘సుమన్‌తో నా మొదటి సినిమాలో నటిస్తానని అనుకోలేదు. ఇంత మంచి సినిమాలో నటించినందుకు ఆనందంగా ఉంది. తప్పకుండా సినిమా విజయం ఖాయం’ అని అన్నారు.

Spread the love