భువనగిరి మండలంలోని బస్వాపురం గ్రామానికి చెందిన ఏశాల అశోక్ బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర కార్యదర్శిగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో జరిగిన రాష్ట్ర సమితి సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏషాల అశోక్ మాట్లాడుతూ.. దేశ జనగణలో కులగనన కూడా జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ దేశంలో బలహీనవర్గాలు ఎంతమంది ఉన్నారో లెక్క తేల్చిన తర్వాత అంత మందికి సరిపడా బడ్జెట్లో నిధులు కేటాయించి వారి అభివృద్ధికి ఖర్చు పెట్టాలని కోరారు. అన్ని రంగాలలో బీసీలు వెనుకబడి ఉన్నారని దేశ జనాభాలో ఎక్కువ మంది బీసీలు ఉన్నప్పటికీ సరైన న్యాయం గుర్తింపు దక్కడం లేదని అన్నారు. ఎన్నికల ముందు ఓట్లతోటి సరిపెడుతున్నారు తప్ప వారి అభివృద్ధికి పాలకులు కృషి చేయడం లేదని అన్నారు.