– బిఎల్ టియు రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ డిమాండ్
నవ తెలంగాణ కంఠేశ్వర్
ఈఎస్ఐ హాస్పిటల్ అవుట్సోర్సింగ్ కార్మికులకు గత ఆరు నెలల బకాయిల వేతనాలు చెల్లించాలని బిఎల్టియు రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం నిజామాబాద్ జిల్లా ఈఎస్ఐ హాస్పిటల్ లో ఔట్ సోర్సింగ్ కార్మికులకు గత 6 నెలల నుండి వేతనాలు లేక అనే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని వెంటనే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని 6 నెలల వేతనాలు ఇప్పించాలని కోరారు. ఈఎస్ఐ హాస్పిటల్ వద్ద జరిగిన ధర్నాను ఉద్దేశించి బి ఎల్ టి యు రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ మాట్లాడుతూ..అతి పేదలైన ఈఎస్ఐ హాస్పిటల్ ఔట్ సోర్సింగ్ కార్మికులు ఇంటి కిరాయి కట్టలేని పరిస్థితిలో ఉన్నారని, 5 నెలలుగా ఇంటి కిరాయి కట్టలేదని ఇంటి యజమానులు ఇల్లు కాళిచేయమడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని చెప్పారు.ఇంటి కిరాయి కట్టలేక, నిఆత్యావసర వస్తువులు, కూరగాయలు, బియ్యం, బీపీ షుగర్ మందులు కొనలేక అంత్యత ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నరని ఆవేదన వ్యక్తం చేశారు.తక్షణమే నిరుపేద కుటుంబాలైన ఈఎస్ఐ హాస్పిటల్ ఔట్ సోర్సింగ్ కార్మికులకు వేతనాలు ఇవ్వాలని,నెలనెలా వేతనాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఎల్ టియు జిల్లా అధ్యక్షులు కె.మధు, ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్ నగర కార్యదర్శి గంగా శంకర్, జిల్లా కమిటి సభ్యులు ఎల్.గోపినాథ్, ఈఎస్ఐ హాస్పిటల్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు శ్రావణ్, మునీర్, యాదమ్మ, గుండమ్మ మిగత కార్మికులు పాల్గొన్నారు.