104పై ‘ఎస్మా’

'Esma' on 104– ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఆదేశాలు
అమరావతి : వైద్యారోగ్యశాఖ పరిధిలోని 104 విభాగంపై ఎస్మా విధించారు. ఆరు నెలలపాటు సమ్మెలు నిషేధిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. దీనిపై వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎమ్‌టి కృష్ణబాబు మంగళవారం ఉత్తర్వులి చ్చారు. ఆంధ్రప్రదేశ్‌ అత్యవసర సర్వీసుల నిర్వహణ చట్టం-1971లోని సబ్‌క్లాజ్‌ (6), సెక్షన్‌(1), సెక్షన్‌ 2 ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. దీని ప్రకారం రాష్ట్రంలోని 104 సర్వీసుల విభాగంలో ఆరు నెలలపాటు ఎటువంటి సమ్మెలూ నిర్వహించ డానికి వీల్లేదని పేర్కొన్నారు. చట్టంలోని సబ్‌ సెక్షన్‌ (1),(3) సెక్షన్‌ 3 ప్రకారం ఈ నిషేధం విధించినట్లు తెలిపారు. ఉత్తర్వులు విడుదలైన వెంటనే ఈ నిషేధం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.

Spread the love