నవతెలంగాణ – కంటేశ్వర్
లయన్స్ సహారా ఆధ్వర్యంలో బీబీసీ హై స్కూల్ వర్ని రోడ్ నిజాంబాద్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సోమవారం రోజు విద్యార్థులకు నిర్వహించినట్లు వ్యాసరచన డ్రాయింగ్ ఉపన్యాస పోటీలను నిర్వహించడం జరిగిందని లయన్ ఉదయ్ సూర్య భగవాన్ తెలిపారు. పర్యావరణం పై అవగాహన విద్యార్థులకు కల్పించడం జరిగింది అని తెలియజేశారు. 2022- 23 సంవత్సరాన్ని ప్లాస్టిక్ గ్రహీత ఇందూరుగా చేయాలని లైన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ సహారా లక్ష్యమని తెలియజేశారు. వృక్షాలను విరివిరిగా నాటి సంరక్షణ బాధ్యతలను ప్రజలు చైతన్యవంతులు కావాలని ప్రజలకు విద్యార్థులకు పలు సూచనలు చేశారు. బీబీసీ పాఠశాలలో నిర్వహించిన ఉపన్యాస పోటీలు వ్యాసరచన పోటీలు డ్రాయింగ్ పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను అందజేయడం జరిగిందన్నారు. కావున వృక్షాలను పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కావున ప్రజలందరూ ఇంటింటికి ఒక మొక్క నాటుకోవాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమానికి లాయన్స్ ధనుంజయ రెడ్డి లయన్ దాసరి వివేక్ లయన్ ప్రవీణ్ పాఠశాల ఉపాధ్యాయులు అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.