నవతెలంగాణ – అస్సాం: జూన్ 21న బాల్య వివాహం కేసులో ఒక మైనర్ బాలికను, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు. తన ప్రియుడితో కలిసి బాలిక పారిపోయిందని ఫిర్యాదు రావడంతో.. పోలీసులు ఆ ఇద్దరిని వెతికి పట్టుకున్నారు. ఘోగ్రాపర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆ యువతికి ధైర్యాన్ని ఇవ్వాల్సిన పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి అధికారి, ఆమెపైనే కన్నేశాడు. తన ఒంటిపై ఉన్న ఖాకీ దుస్తులు చూసుకొని, ఏం చేసినా చెల్లుతుందని భావించి ఆ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దుస్తులు తీయించి, అభ్యంతరకరమైన ఫోటోలు తీశాడు. ఆ బాలిక ఆ పోలీస్ అధికారిపై ఫిర్యాదు చేసింది. ‘నన్ను స్టేషన్‌లోనే ఆ అధికారి నన్ను బెదిరించాడు. బట్టలు తొలగించమని, నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. బలవంతంగా నా ఫోటోలు తీశాడు. అని ఫిర్యాదు చేసింది. ఈ ఘటన సంచలనంగా మారడంతో అస్సాం డీజీపీ జీపీ సింగ్ ఈ కేసుపై రియాక్ట్ అయ్యారు. అస్సాంలోని నల్బరీ జిల్లాలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో జూన్ 21న 17 ఏళ్ల బాలిక ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చిందని.. అయితే ఆమె పట్ల సబ్ ఇన్‌స్పెక్టర్ బిమన్ రాయ్ అసభ్యకరంగా ప్రవర్తించి, లైంగిక వేధింపులకు గురి చేశాడని డీజీపీ జీపీ సింగ్ పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి, వెంటనే ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేశామన్నారు.