శంషాబాద్‌ గర్ల్స్‌ హై స్కూల్‌లో ఇన్నోవేషన్‌ మేకర్‌ స్పేస్‌ ల్యాబ్‌ ఏర్పాటు

– విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మక శక్తులను వెలికి తీయడమే లక్ష్యం
– లెర్నింగ్‌ లింక్స్‌ ఫౌండేషన్‌ ప్రతినిధి చక్రవర్తి
నవతెలంగాణ-శంషాబాద్‌
విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మక శక్తులను, నైపుణ్యాలను వెలికి తీసి భవిష్యత్తులో నూతన ఆవిష్కరణలు చేసే విధంగా తీర్చిదిద్దడం లెర్నింగ్‌ లింక్స్‌ ఫౌండేషన్‌ హెచ్డిఎఫ్సి క్రెడిలా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ లక్ష్యమని ఆ సంస్థ ప్రతినిధి చక్రవర్తి అన్నారు. సోమవారం శంషాబాద్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత ( బాలికల) పాఠశాలలో సంస్థ సహకారంతో ఇన్నోవేషన్‌ మేకర్‌ స్పేస్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేశారు. ప్రదర్శించిన స్టెమ్‌ ఫెయిర్‌లో స్మార్ట్‌ డస్ట్‌ బిన్‌, ఆటోమేటిక్‌ వాటర్‌ ప్లాంట్‌, ప్లాంట్‌ గార్డ్‌ విద్యార్థులు స్టెమ్‌ ఫెయిర్‌ లో ప్రాజెక్ట్స్‌ని ప్రదర్శించారు. ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు బహుమతుల తోపాటు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్నోవేషన్‌ మేకర్స్‌ స్పేస్‌ ల్యాబ్‌ ద్వారా విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకత శక్తిని, నూతన ఆవిష్కరణల వైపు తీసుకు వెళ్లడం కోసం ఏర్పాటు చేశామన్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన ల్యాబ్‌ ద్వారా విద్యార్థులు తమ చుట్టూ ఉన్న సమస్యలకు ఎలక్ట్రానిక్స్‌ ఉపకరణాలు ఉపయోగించి పరిష్కారం కనుగొనే విధంగా రూపకల్పన చేశామన్నారు. విద్యార్థుల్లో ఆలోచనలను ఉత్తేజప రుస్తూ భవిష్యత్తులో కొత్త కొత్త ఆవిష్కరణలు చేసేందుకు ల్యాబ్‌ ఎంతగానో ఉపయోగప డుతుందన్నారు. నేడు చదువుతున్న విద్యార్థులకు సమాజం పట్ల అవగాహనతో పాటు శాస్త్ర సాంకేతిక రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులను అర్థం చేసుకుంటూ అందులో వారి భాగస్వామ్యాన్ని కల్పిం చడమే ప్రధాన ఉద్దేశం అన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకుంటూ ల్యాబ్‌ ను సద్వినియోగం చేసుకో వాలని అన్నారు. ప్రతీ విద్యార్థి అంకితభావం, క్రమశిక్షణ పట్టుదలతో ఉన్నత శిఖరాలు అందు కోవాలని పిలుపునిచ్చారు. గర్ల్స్‌ హై స్కూల్‌లో చదువుతున్న విద్యార్థులు చక్కని క్రమశిక్షణతో విద్యను అభ్యసించడం అభినందనీయమని అన్నారు. పాఠశాల అభివృద్ధికి మరింత సహకారమందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపా ధ్యాయురాలు ఎస్‌. సువర్ణ, ఉపాధ్యాయులు సుర్వి జగతి, తదితరులు పాల్గొన్నారు.

Spread the love