జిల్లాకు కొత్త ధర్నాచౌక్ ఏర్పాటు

నవతెలంగాణ కంఠేశ్వర్ : నిజామాబాద్ ప్రజలు  సంఘాలు / సంస్థలు వాళ్లు నిరసన హక్కును సద్వినియోగం చేసుకోవడంకోసం ధర్నాచౌక్ ఏర్పాటు చేయడం జరిగింది అని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ గురువారం ప్రకటనలో తెలిపారు.  నిజామాబాద్ లో ఎవ్వరయిన ధర్నాలు నిర్వహించాలను కుంటే ఇంతకు ముందు పాత కలెక్టరేటు పరిధిలోని ధర్నా చౌక్ వద్ద నిర్వహించేవారు. అట్టి స్థలంలో ధర్నా చేయడం వలన ప్రధాన రహదారి ద్వారా రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, జిల్లా కోర్టు కాంప్లెక్స్ మరియు జనరల్ హాస్పటల్ లకు వేళ్లే వారికి అడ్డంకులు మరియు ఇబ్బందులు కలిగేవి. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశాల మేరకు నిజామాబాద్ రెవెన్యూ డివిజినల్ అధికారి గారు 1000 చదరపు అడుగుల స్థలం గల ప్రదేశాన్ని ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ అర్బన్ లోని ఆబాదీ ప్రాంతంలోని పాత మున్సిపల్ కార్యాలయం ప్రక్కన ఉన్న 1000 చదరపు గజాల స్థలాన్ని నిజామాబాద్ దక్షిణ మండల సర్వేయర్ ద్వారా హద్దులు పెట్టబడ్డాయి. కావున నిజామాబాద్ రెవెన్యూ డివిజినల్ అధికారి  సమర్పించిన నివేధికను పరిశీలించిన తర్వాత ధర్నాచౌక్ కోసం నిజామాబాద్ దక్షిణ మండలం నిజామాబాద్ అర్బన్ లోని ఆబాదీ ప్రాంతంలోని పాత మున్సిపల్ కార్యలయం ప్రక్కన గల 1000 చదరపు గజాల స్థలం వద్ద ధర్నాలు చేసుకోవచ్చు.ఈ మేరకు జిల్లా పోలీస్ శాఖ ఒక నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎవ్వరయిన నిరసనలు చేయాలనుకునేవారు ముందస్తుగా నిజామాబాద్ ఎ.సి.పి  అనుమతి తప్పనిసరిగ్గా తీసుకొని నిరసన కార్యక్రమములు నిర్వహించాలి. ఎవ్వరయిన ముందస్తు అనుమతి తీసుకోకుండా ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా నిరసనలు నిర్వహింస్తే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
Spread the love