మాంద్యంలోకి యూరోజోన్‌

– వృద్ధి 0.1 శాతానికి పతనం
న్యూఢిల్లీ: యూరోపియన్‌ దేశాలు మాంద్యంలోకి జారుకున్నాయని రిపోర్ట్‌లు వస్తున్నాయి. ఉక్రెయిన్‌, రష్యా పరిణామాలతో భారీగా పెరిగిన ఇంధన ధరలు యూరో ప్రాంతాన్ని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోన్నాయి. హెచ్చు ద్రవ్యోల్బణం ఆ దేశాల వృద్ధి రేటును దెబ్బతీస్తుంది. ప్రస్తుత ఏడాది జనవరి నుంచి మార్చి తొలి త్రైమాసికంలో 20 దేశాల ఆర్థిక వ్యవస్థ వృద్ధి 0.1 శాతానికి పడిపోయింది. ఇంతక్రితం 2022 నాలుగో త్రైమాసికంలోనూ ప్రతికూలతను చవి చూసింది. బ్లూమ్‌బర్గ్‌ పోల్‌ రిపోర్ట్‌ ప్రకారం.. యూరోను ప్రవేశపెట్టినప్పటి నుంచి ద్రవ్యోల్బణం అత్యధిక స్థాయికి చేరినప్పటికీ తిరోగమనాన్ని నివారించవచ్చని రాజకీయ నాయకులు యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ అధికారులు పదే పదే చెప్పినప్పటికీ.. ఆచరణలో ఆ ఫలితాలు కానరావడం లేదు.

Spread the love