నవతెలంగాణ -ఆర్మూర్
ఈవ్ టీజింగ్ చేస్తే షీ టీంకు సమాచారం ఇవ్వాలి ఎవరైనా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన, ఈవ్ టీజింగ్ చేసిన షీ టీంకు సమాచారం ఇవ్వాలని షీ టీం కానిస్టేబుళ్లు, విగ్నేష్, సుమతి అన్నారు. పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాల యందు మంగళవారం సైబర్ క్రైమ్ గురించి విద్యార్థినిలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థినిలు, ఉద్యోగినిలు, మహిళలు ఈవ్‌టీజింగ్, వేధింపులకు గురైతే పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన షీ టీంకు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన మహిళలు, విద్యార్థినిల పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. ఈవ్ టీజింగ్‌కు గురయ్యేవారు భయపడకుండా సమాచారం ఇస్తే రక్షణ కల్పిస్తామన్నారు. షీ టీం నెంబర్ 8712659795కు, డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. క్యూ ఆర్ కోడ్ ద్వారా షీ టీం వారికి ఫిర్యాదు చేసే విధానాన్ని మహిళలకు వివరించారు. అనంతరం షీ టీం కరపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ బాలికల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు మంజుల ,,ఉపాధ్యాయులు విద్యార్థినిలు 650 వరకు పాల్గొన్నారు.