మేడారం జాతర ముగిసినా.. తగ్గని భక్తుల రద్దీ

– కిక్కిరిసిన గద్దెల ప్రాంగణం

– మేడారంలో మండిపడుతున్న ధరలు
– ఏరులై పారుతున్న గుడుంబా
– పట్టించుకోని ఎక్సైజ్ శాఖ అధికారులు
నవతెలంగాణ – తాడ్వాయి
మేడారం జాతర ముగిసిన.. భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం నాడు జరిగే తిరుగువారం పండుగ వరకు కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. మహా జాతరకు రానివారు ఆదివారం నాడు భక్తులు అధిక సంఖ్యలో తండోపతండాలుగా కదిలి వచ్చారు. ఇతర సమయంలో రద్దీ ఎలా ఉందో, ఆదివారం నాడు కూడా కొనసాగింది. దేవతలు నిన్న వన ప్రవేశం చేశారు. కానీ గద్దేల వద్ద భక్తుల రద్దీ కంటిన్యూ అవుతుంది. సమ్మక్క సారమ్మ పగిడిద్దరాజు గోవిందరాజు వనదేవతలకు ఇష్టమైన పసుపు కుంకుమ చిరే సమర్పించి ప్రత్యేక మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆదివారం కాబట్టి ఉదయం నుండి భక్తుల రద్దీ అధికంగా కొనసాగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా సరిహద్దు రాష్ట్రాలైన చతిస్గడ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాష్ట్ర భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మంత్రి సీతక్క మేడారంలో నుండి భక్తులకు ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. కానీ మేడారంలో ధరలు విపరీతంగా మండిపోతున్నాయి. కొలతలు తూనికల అధికారుల జాడే కరువైంది. ఫుడ్ సెక్యూరిటీ అధికారులు కూడా నామమాత్రంగా తనిఖీ నిర్వహించి వదిలేశారు. మనదేవతలకు ఉపయోగపడే బెల్లం నుండి పూజా సామాగ్రిలు నిత్యవసర సరుకులు ధరలు కూల్ డ్రింక్ మద్యం అన్ని రేట్లు మండిపోతున్నాయి. మేడారంలో గుడుంబాం మాత్రం ఏరులై పారుతుంది. ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మత్తులో ఊగిపోతున్నారు. గుడుంబాను అరికట్టే  అధికారుల కరవయ్యారు.
Spread the love