బడికి రాడు.. వచ్చినా చదువు చెప్పడు…

– ప్రధానోపాధ్యాయుడుపై గ్రామస్తులు పిర్యాదు…
– విచారణ చేపట్టిన ఎం.ఇ.ఒ క్రిష్ణయ్య…
నవతెలంగాణ – అశ్వారావుపేట: తరుచూ బడికి డుమ్మా కొడుతూ,ఒక వేళ బడికి వచ్చిన విద్యార్ధులకు చదువు చెప్పకుండా వ్యవహరిస్తున్నాడు అంటూ గ్రామస్తులు ఓ పంతులుపై చేసిన పిర్యాదు మేరకు విద్యాశాఖ మండల అధికారి క్రిష్ణయ్య గురువారం విచారణ చేపట్టారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం మండల పరిధిలోని వడ్డి రంగా పురం ప్రాధమిక పాఠశాలలో 1 నుండి 5 తరగతులు వరకు 36 మంది విద్యార్ధిని విద్యార్ధులు ఉన్నారు.ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు జి.లక్ష్మయ్య,బుచ్చి రాజు ఇద్దరు ఉపాద్యాయులు ఉన్నారు. అయితే ప్రధానోపాధ్యాయుడు లక్ష్మయ్య తరుచూ బడికి రావడం లేదని, వచ్చినా పిల్లలు కు చదువు నేర్పడం లేదని గ్రామస్థులు కొందరు గత నెల 29 న ఎం.ఇ.ఒ క్రిష్ణయ్య కు రాతపూర్వక పిర్యాదు చేసారు.దీంతో ఈయన గురువారం కాంప్లెక్స్ హెచ్.ఎం టి.శ్రీనివాస రావు తో పాటు పాఠశాలలో విచారణ నిర్వహించారు. హెచ్.ఎం లక్ష్మయ్య గత నెల 29 నుండి ఈ నెల 26 వరకు మెడికల్ సెలవులో ఉన్నారని.పాఠశాల లో తిరిగి జాయిన్ అయిన వెంటనే నోటీసు ఇచ్చి,అతని సమాధానాన్ని విద్యాశాఖ జిల్లా అధికారికి నివేదిక అందిస్తాం అని అన్నారు.

Spread the love