ప్రాణం తీసిన సరే అన్హర్వులకు ఇచ్చేది లేదు

నవతెలంగాణ – నసురుల్లాబాద్
అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని, నా ప్రాణం తీసిన సరే అన్హర్వులకు సంక్షేమ పథకాలు ఇచ్చే ప్రసక్తే లేదని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు సోమవారం నసురుల్లాబాద్ మండలంలోని దుర్కి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి దుర్కి ఉదయం గ్రామానికి చేరుకుని గ్రామంలో పలు వీధుల్లో స్వయంగా వెళ్ళి గ్రామస్తులతో ముచ్చటించారు. గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 20 లక్షలతో అంబేద్కర్ భవనం నిర్మాణం,20 లక్షలతో రజక సంఘ భవన నిర్మాణంకు భూమి పూజ చేశారు. దళితవాడలో ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం గ్రామంలో పలు వాడల్లో తిరుగుతూ గ్రామస్థులతో అభివృద్ధి సంక్షేమ పథకాలపై అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ద్వారా ప్రతి కుటుంబానికి అందిస్తున్న సంక్షేమ పథకాలు వచ్చాయా? లేదా? అని అగిడి తెలుకున్నారు. గ్రామంలోని ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వం అని అన్నారు. బాన్సువాడ నియోజకవర్గం లో అన్హార్వులకు సంక్షేమ పథకాలు ఇచ్చేది లేదని నా ప్రాణం తీసిన సరే ఎవరికి లొంగేది లేదన్నారు.
దుర్కి గ్రామ అభివృద్ధిలో భాగంగా గ్రామానికి 100 డబుల్ బెడ్ రూమ్లు మంజూరు కాగా ఇందులో 60 ఇండ్లు పూర్తయ్యాయని మిగత 40 ఇండ్ల పనులు కొనసాగుతున్నాయి అన్నారు. జూలై మాసం నుంచి మూడు లక్షల పథకం వస్తుందని అర్హులైన ప్రతి ఒక్కరికి గృహలక్ష్మి పథకం ఇస్తామన్నారు. అన్హర్వులకు
ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి సంక్షేమలు అందకుండా చూడాల్సిన బాధ్యత గ్రామస్థాయి ప్రజాప్రతినిధులని అన్నారు. అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు..ఈ ప్రతిపక్ష నేతలు ప్రజలకు మంచి జరుగుతుంటే కొందరు చూసి ఓర్వలేక ప్రభుత్వం పై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న పథకాలు ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు అమలు కావడం లేదన్నారు ఇతర రాష్ట్రాల్లో ప్రజలకు కనీస సౌకర్యాలు అందించలేని ప్రభుత్వాలు ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి ఎంపీపీ పాల్త్య విఠల్, మాజీ గ్రంథాలయ చైర్మన్ డిప్యూటీ శ్రీనివాస్ యాదవ్, మాజీ జెడ్పిటిసి కిషోర్ యాదవ్, గ్రామ సర్పంచ్ శ్యామల శ్రీనివాస్, ఎంపీటీసీ డాక్టర్ నారాయణ, మండల కో ఆప్షన్ నెంబర్ ముస్తఫా హుస్సేన్, గ్రామ మాజీ సర్పంచ్ మోహన్, నాయకులు శంకర్ యాదవ్, మైసయ్య, మహేష్, మధు పటేల్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love