– బీఆర్‌ఎస్ శ్రేణుల్లో నిరుత్సాహం
నవతెలంగాణ- గజ్వేల్
బీఆర్‌ఎస్ అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ అసెంబ్లీ నుంచి గెలుపొందినా… మూడోసారి అధికారం రాకపోవడంతో పార్టీ శ్రేణులు నిరాశకు గురయ్యారు. నాయకులు మధ్య అసంతప్తి ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో వారందరిని మాజీ మంత్రి హరీష్ రావు ఏకతాటిపైకి తీసుకొచ్చి ఎన్నికల్లో అధినేతకు భారీ మెజార్టీ తీసుకొచ్చేలా చేశారు. ముఖ్యమంత్రి హౌదాలో తమ అభ్యర్థులకు గెలుపులకు కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా 96 ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని విస్తత ప్రచారం నిర్వహించారు. తన న్యూ వర్గానికి కేవలం ఒకే ఒక రోజు కేటాయించారు. ఈ నేపథ్యంలో గజ్వేల్ లో కెసిఆర్ విజయానికి ఆ పార్టీ నేతలు కషి చేశారు. గజ్వేల్ అసెంబ్లీ నుండి బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్, మరోవైపు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి బల్లులు నిలిచి ప్రత్యక్షంగా ప్రచారం పాల్గొన్నారు. వారు ముఖ్యమంత్రి పై చేసిన విమర్శలు రాష్ట్రవ్యాప్తంగా గజ్వేల్ ఫలితం పై ఉత్కంఠ గా ఉండగా ఆదివారం వెళ్ళ బడిన ఫలితం స్థానిక నాయకు లకు కొంత తప్తి ఉన్నప్పటికీ రా ష్ట్రంలో అధికా రం కోల్పో యి నిరాశగా ఉన్నా రు. బిజెపి అభ్యర్థి బీసీ నినాదంతో, కాంగ్రెస్ అభ్యర్థి ఆరు గ్యారెంటీలతో ప్రచా రాన్ని నిర్వహి ంచారు. కెసిఆర్ సూచనలు సలహాలు పాటి స్తూ హరీష్ రావు, గజ్వేల్ నేతలు ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, తెలంగాణ ఫారెస్ట్రీమెన్ ప్రతాప్ రెడ్డి, డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, గ్రంధాల సంస్థ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, డిసిసిబి డైరెక్టర్ అంజిరెడ్డి, ఏఎంసీ చైర్మన్లు జాంగిర్, మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్లు రాజమౌళి, రవీంద్ర గౌడ్ లను సమన్యపరుస్తూ హరీష్ రావు ప్రచారాన్ని ముందుకు తీసుకుపోయారు. కాంగ్రెస్ బిజెపి అభ్యర్థులు గెలిస్తే గజ్వేల్ అభివద్ధి కుంటుపడుతుందని ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ఆశతో ప్రజలకు హరీష్ రావు వివరించారు. గజ్వేల్ అసెంబ్లీ నుండి ఇతరులు గెలిస్తే కెసిఆర్ చేసిన అభివద్ధి పనులకు కనీసం సున్నం కూడా వేయలేని పరిస్థితి వస్తుందని ఆయన ప్రచారం చేశారు. ఈ విషయాన్ని ప్రజలు చర్చించుకుని కేసీఆర్ కు విజయాన్ని అందించారు. దీంతో కెసిఆర్ ను మూడోసారి గజ్వేల్ లో గెలిపించారు. ఇది ఇలా ఉండగా పార్టీ అధినేత గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి మ్యాజిక్ ఫిగర్ ను సాధించలేకపోయింది. దీంతో పార్టీ శ్రేణుల్లో నిరుత్సవం నెలకొన్నది.