రష్మికతో టచ్‌లో ఉన్నా.. మెసేజ్‌లు కూడా చేసుకుంటాం

నవతెలంగాణ- హైదరాబాద్ :ఎవరికై నా అదృష్టం ఎంత అవసరమో అన్నది హీరోయిన్‌ రష్మిక మందన్నను చూస్తే తెలుస్తుంది. కొందరికి అందం ప్రతిభా ఉన్నా లక్కు దోబూచులాడుంది. అది లేకపోతే ఎన్ని ఉన్నా పైకి రావడం సాధ్యం కాదు. నటి రష్మిక విషయంలో అదృష్టమే కీలకం అయ్యిందని చెప్పక తప్పదు. 2016 కిరాక్‌ పార్టీ అనే కన్నడ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమైన రష్మిక మందన్న. తొలిచిత్రమే మంచి విజయాన్ని సాధించడంతో ఈ కన్నడ బ్యూటీకి వెంటనే టాలీవుడ్‌ నుంచి పిలుపు వచ్చింది. అలా అక్కడ ఛలో అనే చిత్రంలో కథానాయకిగా నటించింది ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇక్కడే రష్మిక మందన్న అదృష్టం ఏమిటో అర్థం అయిపోతుంది. ఆ తర్వాత గీత గోవిందం చిత్రం ఈ అమ్మడిని క్రేజీ హీరోయిన్‌ను చేసేసింది. ఇక ఆ తర్వాత అల్లు అర్జున్‌తో జతకట్టిన పుష్ప చిత్రం స్టార్‌ హీరోయిన్‌ను చేయడంతో పాటు బాలీవుడ్‌కు తీసుకెళ్లింది. అయితే కోలీవుడ్‌లో ఈమెకు లక్కు అనే మ్యాజిక్కు పెద్దగా పనిచేయలేదు. అదేవిధంగా బాలీవుడ్‌లో నటించిన రెండు చిత్రాలు ఆశించిన విజయాలను సాధించలేదు. త్వరలో తెరపైకి రానున్న యానిమల్‌ చిత్రం రిజల్ట్‌ కోసమే రష్మిక మందన్న ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉందని చెప్పవచ్చు. ఇక ఈమె వ్యక్తిగత విషయాలు గురించి చెప్పాలంటే చాలా కథలే ఉన్నాయి. కన్నడంలో నటించిన తొలి చిత్రం షూటింగ్‌ దశలోనే ఆ చిత్ర హీరో రక్షిత్‌ శెట్టి ప్రేమలో పడింది. వీరిద్దరి ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వెళ్లింది. అయితే ఆ తర్వాత అది ముందుకు సాగలేదు. పెళ్లి పీటలూ ఎక్కలేదు. ఇక గీత గోవిందం చిత్రం తర్వాత ఆ చిత్ర కథానాయకుడు విజయ్‌ దేవరకొండతో చెట్టాపట్టాల్‌ అంటూ ప్రచారం బాగానే జరిగుతుంది. వీరిద్దరూ సహజీవనంలో ఉన్నారనే మాటా వినిపిస్తోంది. అయితే అలాంటి వార్తలను రష్మిక ఖండించింది. ఫ్రెండ్స్‌ మాత్రమే అని స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో రష్మిక మందన్న మాజీ ప్రియుడు రక్షిత్‌ శెట్టి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ తాను నటి రష్మిక మందన్నతో ఇప్పటికీ టచ్‌లోనే ఉన్నాం అని పేర్కొన్నారు. ఫోన్‌ ద్వారా మెసేజ్‌లు చేసుకుంటామని, చిత్రాలు విడుదల సమయంలో ఒకరికొకరు అభినందనలు తెలుపుకుంటామని చెప్పారు. రష్మిక ముందన్న నటిగా చాలా కలలు ఉన్నాయని, దాన్ని కరెక్ట్‌ గా అర్థం చేసుకొని ఇప్పుడు నేషనల్‌ క్రష్‌ అయ్యిందని పేర్కొన్నారు. ఈయన వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

 

Spread the love