ప్రతి గర్భిణీ స్త్రీని 12 వారాలలోపు నమోదు చేయాలి…

– 12 వారాలు దాటితే నమోదు చేయడం కష్టం..

నవతెలంగాణ- డిచ్ పల్లి

ప్రతి గర్భిణీ స్త్రీని 12 వారాలలోపు నమోదు చేయాలని, 12 వారాలు దాటితే నమోదు చేయడం కష్టమవుతుందని డాక్టర్  సంతోష్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఇందల్ వాయి మండల కేంద్రంలోని  ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తల సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి ఆరోగ్య ఉప కేంద్రంలో జరుగుతున్న టువంటి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.గర్బిణి స్త్రీ లకు
న్యూట్రిషన్ కిట్ కుడా ఇవ్వడం కష్టమవుతుందని వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవం కోసం గర్భిణీ స్త్రీలకు తీసుకొని రావాలని, అంగన్వాడి కేంద్రాలలో ప్రతి గర్భిణీ స్త్రీ కి పూర్తిస్థాయి పౌష్టికాహారం అందేలా చూడాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం అయిన బాలింతను తీసుకెళ్లి గర్భిణీ స్త్రీలకు ప్రోత్సాహం చేయించాలని తెలిపారు. అలాగే అసంక్రమిత వ్యాధులైన హైపర్ టెన్షన్ డయాబెటిస్ లాంటి వ్యాధులకు తీసుకోవలసిన మందులు ప్రభుత్వాసుపత్రిలోనే తీసుకోవాలని, తీసుకునేలా అశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది చుడాలని వివరించారు.   ప్రైవేటు ఆసుపత్రిలో ఈ వ్యాధులకు మందులు తీసుకుంటున్న వారిని ప్రభుత్వ ఆసుపత్రిలో తీసుకునేలా ప్రోత్సహించాలని తెలిపారు. సీజనల్ వ్యాధులు మలేరియా, డెంగ్యూ, చికూన్ గున్య, దోమ కాటు వ్యాధుల పట్ల అప్రమత్తత ఉండాలని ప్రతి గ్రామంలో నీరు నిల్వగల ప్రాంతాలను గుర్తించి గ్రామపంచాయతీ సెక్రటరీకి నివేదించాలని, గ్రామపంచాయతీచే  దోమల నివారణ మందులను స్ప్రే చేయించాలని పేర్కొన్నారు. చలికాలంలో విస్తృతంగా వ్యాపిస్తునటువంటి క్షయ వ్యాధి నివారణకు తీసుకోవలసిన చర్యల గురించి వివరించారు. క్షయ వ్యాధి  నిర్ధారణ కొరకు తేమడ పరీక్షకు ప్రతి ఒక్కరు ప్రభుత్వ ఆసుపత్రి కి పంపించాలని, తెమడ పరీక్షకు సాంపుల్స్ పంపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్ ఆరోగ్య పర్యవేక్షులు అక్బర్ అలీ, ఆరోగ్య కార్యకర్తలు వెంకటరెడ్డి, ఆనంద్, ఫార్మసిస్ట్ విజయలక్ష్మి ,ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love