ప్రతి విద్యార్థి ప్రభుత్వ బడిలోనే చేరాలి 

నవతెలంగాణ-కొత్తగూడ: ప్రతి విద్యార్థి ప్రభుత్వ బడిలోనే చేరాలని అందుకు విద్యార్థి తల్లితండ్రులు కృషి చేయాలని గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఈసం రాజమ్మ అన్నారు. బడిబాట కార్యక్రమం లో భాగంగా గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మంగళవారం మండలం లోని పలు గ్రామాలలో పర్యటించి ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు, నిష్ణాతులైన ఉపాధ్యాయులచే బోధన, ఉచిత పాఠ్యపుస్తకాలు, దుస్తుల పంపిణీ, తదితర సౌకర్యాలను వివరిస్తూ పిల్లలను పాఠశాలల్లో చేర్చాలని విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.అనంతరం ప్రధానోపాధ్యాయురాలు రాజమ్మ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌ స్థాయి సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరి వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ బడిబాట కార్యక్రమం లో ఉపాధ్యాయనీలు శ్రీలత, ఆదిలక్ష్మి, శ్రీలత, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
Spread the love