– మిషన్ భగీరథ సర్వేకు సహకరించాలి: యూసుఫ్ ఖాన్
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
మండలంలో అన్ని గ్రామాలలో మూడు రోజులకు ఒకసారి ప్రతి వీధికి చెత్త సేకరించి ట్రాక్టర్ వస్తుందని మండల పంచాయతీ అధికారి యూసుఫ్ ఖాన్ గురువారం అన్నారు. మండలంలోని అర్గుల్ గ్రామంలో మహిళ గ్రామ సంఘా సమావేశం గురువారం నిర్వహించారు. కార్యక్రమానికి మండల పంచాయతీ అధికారి యూసుఫ్ ఖాన్ హాజరై మాట్లాడుతూ.. నేటి నుంచి అర్గుల్ గ్రామంలో మిషన్ భగీరథ సర్వే నిర్వహిస్తున్నారని సర్వేకు ప్రతి ఒక్కరు సహకరించి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా నల్ల నీళ్లు ఎన్ని వస్తున్నాయా.. రావడం లేదా, నీటి సమస్యలు తెలియజేయాలన్నారు. మహిళలందరూ ప్రతి ఇంటిలో తడి, పొడి చెత్త సేకరించి మీ వీధికి ట్రాక్టర్ వచ్చినప్పుడు చెత్తను వేసి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్ ఐకెపి కమ్యూనిటీ కోఆర్డినేటర్, గ్రామ సంఘం ప్రతినిధులు, అన్ని సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.