కాంగ్రెస్‌ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్తా కృషి చేయాలి

– కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధారాసింగ్‌
– కాంగ్రెస్‌ గ్రామ కమిటీలు ఎన్నిక
నవతెలంగాణ-పెద్దేముల్‌
కాంగ్రెస్‌ గెలుపు లక్ష్యంగా ప్రతి కార్యకర్తా కృషి చేయా లని కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధారాసింగ్‌ పిలుపు నిచ్చారు. మంగళవారం పెద్దేముల్‌ మండలంలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షులు గోపాల్‌ ఆధ్వర్యంలో హన్మాపూర్‌, గోట్ల పల్లి, గిర్మాపూర్‌, జైరాం తండా, ధారునాయక్‌ తండా గ్రా మాల్లో కాంగ్రెస్‌ గ్రామ కమిటీ అధ్యక్షులను, ప్రధాన కార్య దర్శులను కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధారాసింగ్‌ సమక్షంలో ఏకగ్రీవంగా నియామక పత్రం అందజేశారు. హన్మాపూర్‌ గ్రామ కమిటీ అధ్యక్షులుగా లొంక వెంకటేష్‌, ప్రధాన కార్యదర్శిగా రాములు, గోట్లపల్లి గ్రామ కమిటీ అ ధ్యక్షులుగా బంటు చంద్రప్ప, కార్యదర్శిగా బసంత్‌ పటేల్‌, గిర్మాపూర్‌ గ్రామ కమిటీ అధ్యక్షులుగా మైసప్ప, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్‌ పటేల్‌, జైరాంతండా గ్రామ కమిటీ అధ్యక్షులుగా దినేష్‌ రాథోడ్‌, ప్రధాన కార్యదర్శిగా బద్రు నాయక్‌, ధారు నాయక్‌ తండా గ్రామ కమిటీ అధ్యక్షులుగా మేఘావత్‌ రవి, ప్రధాన కార్యదర్శిగా జాదవ్‌ నరేష్‌లను నియమిచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధారాసింగ్‌ మాట్లాడుతూ…కాంగ్రెస్‌ హయాం లోనే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధికి నోచుకున్నాయని తెలిపారు. రానున్న ఎన్నికల్లో తాండూర్‌ ప్రాంతంలో కాంగ్రెస్‌ను గెలిపించేందుకు కార్యకర్తలు తమ వంతు కృషి చేయాలని సూచించారు. తాండూర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాం డూర్‌ ప్రాంతంలో కాంగ్రెస్‌ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సెల్‌ కన్వీనర్‌ రియాజ్‌, మండల కాంగ్రెస్‌ కోఆప్షన్‌ సభ్యులు నసీర్‌, తాం డూర్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ ఏ బ్లాక్‌ అధ్యక్షులు లొంక నర్సింలు, పెద్దేముల్‌ మండల్‌ బీసీ సెల్‌ అధ్యక్షులు రేగోం డి వెంకటయ్య, పెద్దేముల్‌ మండల ఎస్టీ సెల్‌ అధ్యక్షులు నారాయణ, మైనార్టీ కోఆర్డినేటర్‌ రాజు, కాంగ్రెస్‌ కార్యకర్తలు తదితరులున్నారు.

Spread the love