– గ్రామంలో ఘన స్వాగతం,సన్మానం..
– అందరి సహకారంతో అబివృద్ధి..
నవతెలంగాణ – డిచ్ పల్లి
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల ఐడిసిఎంఎస్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించి మొట్టమొదటి సారిగా డిచ్ పల్లి మండలం లోని రాంపూర్ డి గ్రామానికి వస్తున్న శుభ సందర్భంగా గ్రామ అభివృద్ది కమిటీ అద్వర్యంలో ఘనంగా స్వాగతం పలికి సన్మానం చేశారు.ఈ కార్యక్రమానికి రాంపూర్ డి సహకార సొసైటీ పరిధిలోని ఏడు గ్రామాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, సహకార సొసైటీ డైరెక్టర్లు,రైతులు పాల్గొని మాట్లాడుతూ తారాచంద్ నాయక్ అందరి వారని,గత రెండు సార్లు సోసైటి చైర్మన్ గా ఎన్నికై నేడు ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, తోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరుల సహాయ, సహకారాలతో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల ఐడిసిఎంఎస్ చైర్మన్ గా ఎన్నుకోవడం అభినందనమన్నారు. రాంపూర్ సహకార సొసైటీ నష్టాల బాటలో ఉన్నప్పుడు సోసైటి పాలకవర్గం విశేష కృషి చేసి నష్టాల బాట నుండి లాభాల బాటలో తిసుకుని వచ్చారని ఇదంతా చైర్మన్ తారాచంద్ నాయక్ కు దక్కుతుందని వారన్నారు.రాబోవు రోజుల్లో సహకార సొసైటీ నుంచి, ఉమ్మడి జిల్లాల్లో ఉన్న సహకార సొసైటీ లో బలోపేతం కోసం కృషి చేయాలని కోరారు.రాంపూర్ గ్రామంలోని మారుముల గిరిజన తండా జన్మించరని,పార్టీలకు అతీతంగా తనవంతు పాత్ర పోషించారని కోనియడారు. సిటు వస్తుంది పోతుంది కానీ తమ హయాంలో చేసిన అబివృద్ధి పనులు మాత్రం ఎళ్ళవేళల ఉంటాయన్నారు. సోసైటి లో చాలా అనుభవం ఉన్న వ్యక్తి తారాచంద్ నాయక్ అన్నారు.
సన్మాన కార్యక్రమం అనంతరం ఐడిసిఎంఎస్ చైర్మన్ తారా చంద్ నాయక్ మాట్లాడుతూ ఐడిసిఎంఎస్ చైర్మన్ పదవి రావడానికి ఎందరో కృషి చేశారని వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు.
రైతుల సంక్షేమం కోసం, ఏలాంటి ఇబ్బందులకు గురి కాకుండా శక్తి మేర కృషి చేస్తానని వివరించారు. సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యమని, ఉమ్మడి జిల్లాల పదవి కి న్యాయం చేస్తానని, అవసరాల మేరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ప్రభుత్వ సలహాదారుల మద్దతు తో అబివృద్ధి కి తోడ్పడుతదని వివరించారు.ఎంపీపీ గా రామకృష్ణ రెడ్డి,గ్రామంలో పుట్టి పెరిగి అంచేలంచేలుగా ఎదిగి డిసిసిబి చైర్మన్ గా వి గంగాధర్ గౌడ్ తోమ్మిదేళ్ళ పాటు చైర్మన్ గా ఉంటు, రెండు సార్లు ఎమ్మెల్సీ గా ఉంటుందనే గ్రామ,సోసైటి అబివృద్ధి కి కృషి చేశారని వారు చేసిన సేవలను కోనియడారు.సహకర రంగం రైతులతో ముడిపడి ఉందని, రైతులకు ఎంత చేసినా తక్కువేనని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సోసైటి పరిధిలోని ఆయా గ్రామాలలో నాబార్డ్ ద్వారా సోసైటి భవన నిర్మాణం చేపట్టి,ఇతర గ్రామాల్లో మార్కేట్ యార్డ్ నిర్మిస్తామని, ప్రతి దానికీ రైతులు సహకారం అందజేయాలని అయన కోరారు. కష్టపడి ఈ స్థాయికి వచ్చనంటే నటి నుండి నేటి వరకు కష్టాలు, నష్టాలు అనుభవించి చైర్మన్ గా అయ్యాయని,ప్రజలకు, రైతుల కష్టా సుఖాల్లో పాల్గొనాలని, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అప్పుడే పదవులు వేతుకుంటు వస్తాయని తారాచంద్ నాయక్ అన్నారు.అంతకు ముందు గ్రామంలోని పలు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డిచ్ పల్లి మాజీ ఎంపీపీలు కంచెట్టి గంగాధర్, నర్సయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోలసని శ్రీనివాస్, రాంపూర్ తాజా మాజీ ఉప సర్పంచ్ ఎంకనోల్ల రమేష్,మాజీ ఉప సర్పంచ్ల ఫోరం మండల కన్వీనర్ రఘునథన్ రాము, మాజీ సర్పంచ్లు తిరుపతి,అశన్న, బాల్ రామ్ నాయక్, గాంధారి రాజు, మాజీ ఎంపిటిసి చింతల దాస్, డైరెక్టర్లు రాజ్ కుమార్, బోక్క గంగాధర్, మెకల రమేష్, కాంగ్రెస్ మండల కార్యదర్శి లచ్చమొల్ల దత్తాద్రి, ఇంచార్జీ సిఈఓ నాగేశ్వరరావు, మహిపాల్ నాయక్, రవి, లచ్చమొల్ల రాజు తో పాటు రైతులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.