నవతెలంగాణ-చివ్వేంల : ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం గా ఉండకుండా తగు జాగ్రత్తలు పాటించి ప్రతి ఒక్కరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు జూలకంటి సుధాకర్ రెడ్డి,మన్నా చర్చ్ పాస్టర్ సామ్యేల్ అన్నారు. మంగళవారంమండలకేంద్రంలోని మన్నా చర్చ్ ప్రాంగణంలో కామినేని హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. శారీరక శ్రమ వల్ల కొంత ఆరోగ్యంగా ఉండవచ్చునని తెలిపారు. ప్రతిరోజు ఉదయం నడకను అలవాటు చేసుకోవాలని సూచించారు. ఉచిత వైద్య శిబిరం నిర్వహించు చున్న కామినేని యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.