ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలి

– చేవెళ్ల పార్లమెంట్‌ ఎన్నికల కౌంటింగ్‌ చేవెళ్లలో పాత ఇంజనీరింగ్‌ కళాశాలలో
– రాజేంద్రనగర్‌ ఆర్వో కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ
– రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శశాంక్‌
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌
రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెంచ డానికి కషి చేస్తున్నామని ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శశాంక్‌ అన్నారు. మంగళవారం రాజేంద్రనగర్‌లోని తహసీల్దార్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల కోసం రాజేంద్రనగర్‌ ఎమ్మార్వో కార్యాలయంలో ఆర్‌వో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. చేవెళ్ల పార్లమెంటుకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ఇక్కడే జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యాల యంలో రాజేంద్రనగర్‌ ఆర్డిఓ వెంకట్‌ రెడ్డి,ఎమ్మార్వో రాములు నిత్యం అందుబాటులో ఉంటారని అదేవిధంగా నామినేషన్ల ప్రక్రియ గురించి వివరించడానికి ఇక్కడ ప్రత్యేక ప్రత్యేక హెల్ప్‌ డెస్క్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జూన్‌ 4న కౌంటింగ్‌ చేవెళ్లలోని పాత ఇంజనీరింగ్‌ కళాశాలలో జరుగుతుందని అన్నారు. అన్ని పార్టీల నాయకులతో మాట్లాడి అందరికీ అనుకూలమైన ప్రదేశంగా చేవెళ్లే ఉండడంతో అక్కడ కౌంటింగ్‌ ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. చేవెళ్ల పరిధిలోని శేర్లింగంపల్లి,రాజేంద్రనగర్‌, మహేశ్వరం నియోజకవర్గాల్లో పోలింగ్‌ కేంద్రాల సంఖ్య గణనీయంగా ఉందని ఆయన అన్నారు. పోలింగ్‌ రోజున పోలింగ్‌ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. అందులో భాగంగానే ఈసారి పిఓ, ఏపీఓల కూడా పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. ఏదైనా ఈవీయంలో సాంకేతిక సమ స్యలు తలెత్తినప్పుడు ఐదు నిమిషాల్లో ఆ పోలింగ్‌ కేంద్రా నికి వెళ్లడానికి సిబ్బందిని అందుబాటులో ఉంచామని తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద హెల్ప్‌ డే స్కూల్‌ కూడా ఏర్పాటు చేశామని అదేవిధంగా వద్ధుల కోసం ప్రత్యేక వీల్‌ చైర్లు కూడా ఏర్పాటు చేశామని అన్నారు. పోలింగ్‌ కేంద్రం దగ్గర 100 మీటర్ల ఆంక్షలు ఉంటాయని ఎవరు అతిక్ర మించినా చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరిం చారు. ఓటింగ్‌ శాతం పెంచడానికి వివి ధ కార్యక్రమాలను నిర్వహించామని ఆయన గుర్తుచేశారు. ముఖ్యంగా ఉద్యో గులు, విద్యార్థులు, యువత ఈసారి కచ్చి తంగా ఓటు వేయాలన్నారు. ఈ పార్లమెంటు ఎన్నికలు సజావుగా జరగ డానికి ప్రతి ఒక్కరూ సహకరించాలఅన్నారు. పార్లమెంట్‌ పరిధిలోని మహేశ్వరం రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి, చేవెళ్ల, పరిగి, వికారాబాద్‌, తాండూర్‌, నియోజకవర్గాలలో మొత్తం 29 లక్షల 28 వేల186 మంది ఓటర్లుగా నమోదైనట్టు తెలిపారు.ప్రస్తుతం ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన కొత్తఓటర్ల నమోదు ప్రక్రియకు సంబం ధించిన దరఖాస్తుల తో పాటు ఇతర 15 వేల దరఖాస్తులు ఉన్నాయన్నారు.వాటినన్నిటిని అధికారులు పరిశీలిస్తున్న ట్టు తెలిపారు. ఈ సంఖ్య మరింత పెరుగనుందన్నారు. ప్రతిరోజు తహసీల్దార్‌ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిం చనున్నట్లు తెలిపారు. నామినేషన్‌ వేసేందుకు వచ్చే అభ్యర్థి తో పాటు మరో నలుగురిని మాత్రమే లోనికి అనుమతి ఇస్తామన్నారు. 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు నామి నేషన్ల స్వీకరణ కొనసాగుతుందన్నారు.21వ తేదీన పబ్లిక్‌ హాలిడే నేపథ్యంలో ఆరోజు ఎలాంటి నామినేషన్లను స్వీక రించమని వెల్లడించారు. 26వ తేదీన స్కూటీని 27వ తేదీ నుండి 29వ తేదీ వరకు విత్‌ డ్రాకు అవకాశమిచ్చినట్టు తెలిపారు మొత్తం ఏడు నియోజకవర్గాలలో 29 లక్షల 28వేల 186 మంది ఓటర్లలో 14,99,261 మంది పురు షులు 14 లక్షల 28 వేల 645 మంది మహిళలు 280 మంది ఇతరులు ఓటర్లుగా నమోదైనట్లు తెలిపారు .చేవెళ్ల పార్లమెంటులో మొత్తం 2824 పోలింగ్‌ బూత్‌ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.పార్లమెంట్‌ పరిధిలో 13,448 మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నట్టు తెలిపారు. అంతే స్థాయిలో పోలీసులు సైతం విధులు నిర్వహిస్తున్నా రని తెలిపారు. ఈ సమావేశంలోఅడిషనల్‌ కలెక్టర్‌ ప్రతిమసింగ్‌ నోడల్‌ ఆఫీసర్‌ సంగీత ఆర్డిఓ వెంకట్‌ రెడ్డి ఎమ్మార్వో రాములు పాల్గొన్నారు.

Spread the love