రాజ్యాంగ విలువల కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలి

నవతెలంగాణ –  తుంగతుర్తి
స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకొని వారి ఆదర్శాలకు పునరంకితం కావాలని, భారత రాజ్యాంగంలోని విలువల హక్కుల కోసం పాటుపడాలని తుంగతుర్తి మండల కేంద్రంలోని మేరీ మదర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రిన్సిపాల్ సిస్టర్ మేరి విజ్జి అన్నారు. శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ నాయకుల చిత్రపటాలకు, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు. ఈ మేరకు మన జాతీయ పోరాటానికి స్ఫూర్తి ఇచ్చిన సత్యం, అహింస, శాంతి, సంఘీభావం, సార్వత్రిక సౌబ్రాతృత్వం యొక్క గొప్ప ఆదర్శాలను తిరిగి అంకితం చేసే రోజుగా గణతంత్ర దీనోత్సవం జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఈ మేరకు పాఠశాలలో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ సిస్టర్ అలేసియా,ఫాదర్ కాస్పర్,వైస్ ప్రిన్సిపాల్ సిస్టర్ రిన్సీ,సిస్టర్ హెలెన్,సిస్టర్ జ్యోతి, సిస్టర్ మరియ,స్టాఫ్ సెక్రటరీ అనిత, అసిస్టెంట్ సెక్రటరీ అశోక్ ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love