కంటి వెలుగును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి

– హుస్నాబాద్ ఎంపీపీ లకావత్ మానస
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
కంటి వెలుగులు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని హుస్నాబాద్ ఎంపీపీ లతావత్ మానస సుభాష్ అన్నారు. మంగళవారం హుస్నాబాద్ మండలంలోని వంగరామయ్యాపల్లిలో సర్పంచ్ వంగ విజయలక్ష్మి తో కలిసి ఎంపీపీ మానస కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు కంటి వెలుగు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి వెంకటరామిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి జ్యోతి, వార్డు సభ్యులు వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love