– ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
– బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది, కెకె
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
సనాతన ధర్మపరిరక్షణకు, వేద సంప్రదాయాలు కాపాడేందుకు, ప్రాచీన విలువలను కాపాడుకునేందుకు ప్రతిఒక్కరూ కంకణ బద్దులు కావాలని వేములవాడ ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. బుధవారం తంగళ్ళపల్లి మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి లు పాల్గొన్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు హాజరైన అతిథులకు తంగళ్ళపల్లి ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు.తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.స్వామివారి అనుగ్రహంతో ప్రజలు,గ్రామస్తులందరూ ఆయురారోగ్యాలతో,సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతిరెడ్డి,కాంగ్రెస్ మండల అధ్యక్షుడు టోని,ఆలయ కమిటీ అధ్యక్షుడు మచ్చ శ్రీనివాస్,వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నరసింగం గౌడ్,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు,ఆలయ కమిటీ సభ్యులు,స్థానిక ప్రజాప్రతినిధులు,నాయకులు,భక్తులు,గ్రామస్తులు పాల్గొన్నారు.