ప్రతి ఒక్కరూ జ్వరాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

– సురేందర్‌ గౌడ్‌
నవ తెలంగాణ- ఆత్మకూరు
ఆత్మకూరు పట్టణంలో శుక్రవారం మూడో వార్డు నందు తిపుడంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది వారి ఆధ్వర్యంలో యాంటీ లార్వా సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య సూపర్వైజర్‌ సురేందర్‌ గౌడ్‌ వార్డు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిమెంట్‌ ట్యాంకీలలో.నీళ్ల డబ్బాలో నీరు నిలవకుండా చూసుకోవాలని, దోమలు రాకుండా సాయంకాలం పూట వేపాకు పొగా వేసుకోవాలని, మరియు దోమతెరలు వాడాలని సూచించారు. దోమల వలన డెంగ్యూ ,మలేరియా, చికెన్‌ గున్యా జ్వరాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఇట్టి కార్యక్రమంలో,విజరు, ఇమ్రాన్‌, వార్డు పాల్గొన్నారు.
పెబ్బేరు : పెబ్బేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మున్సిపల్‌ పరిధిలోని ఆరోగ్య ఉప కేంద్రం పెబ్బేరులో 10 వార్డ్‌, లో జరుగుతున్న యాంటీ లార్వా సర్వే ను పరిశీలిస్తున్న హెల్త్‌ సూపర్‌ వైజర్‌ సూర్య నారాయణ. సిమెంట్‌ ట్యాంక్‌ లో, పులా కుండీలో, ఎయిర్‌ కూలర్‌, వాటర్‌ డబ్బలో నీరు నిలవకుండా ఉండాలన్నారు. అలాగే దోమలు రాకుండా సాయంకాలము సమయములో వేపాకు పొగ వేసుకోవాలి మరియు దోమ తెరలు వాడాలి. డెంగ్యూ, మలేరియా, చికున్‌ గున్యా వంటి జ్వరాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హెల్త్‌ అసిస్టెంట్‌ రాజశేఖర్‌, వెంకటమ్మ, బ్రీడింగ్‌ చెక్కర్‌ నరసింహ వార్డ్‌ ప్రజలు పాల్గొన్నారు.

Spread the love