కల్వకుర్తి ఆర్ డీఓ రాజేష్ కుమార్ ఆమనగల్ చెంచు కాలనీలో
పర్యటించిన రెవెన్యూ అధికారులు
నవతెలంగాణ-ఆమనగల్
అర్హులైన ప్రతి ఒక్క ఓటు హక్కు కలిగి ఉండాలని కల్వకుర్తి ఆర్ డీఓ రాజేష్ కుమార్ అన్నారు. చెంచు సం ఘం రాష్ట్ర అధ్యక్షులు చెంచు జంగయ్య, స్థానిక తహసీల్దా ర్ జ్యోతి తదితరులతో కలిసి శుక్రవారం ఆమనగల్ పట్ట ణంలోని చెంచు కాలనీలో కల్వకుర్తి ఆర్ డీఓ రాజేష్ కు మార్ పర్యటించారు. ఈసందర్భంగా చెంచు కుటుం బాలతో మాట్లాడి ప్రభుత్వ పరంగా వారికి అందుతున్న సంక్షేమ ప్రోత్సాహకాలను తెలుసుకున్నారు. కాలనీలో 18 చెంచు కుటుంబాలు నివసిస్తుండగా వారిలో కేవ లం ముగ్గురికి మాత్రమే ఓటు హక్కు ఉన్నట్టు గుర్తిం చారు. 17 సంవత్సరాల వయస్సు పూర్తవుతున్న వారు తప్పనిసరిగా ఓటు హక్కు కలిగి ఉండాలని సూచిం చారు. మూడు రోజుల్లో ఆమనగల్, కడ్తాల్ మండలా లతో పాటు శంకర్ కొండ గ్రామాలకు చెందిన చెంచు కు టుంబాల్లో ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటరు నమోదు చేయించాలని తహసీల్దార్ జ్యోతితో పాటు చెంచు సం ఘం రాష్ట్ర అధ్యక్షులు చెంచు జంగయ్యకు ఆర్ డీఓ రాజేష్ కుమార్ ఆదేశించారు.