– అయినాపూర్ ఎనిమిదో వార్డ్‌లో ఎక్కడి సమస్యలు అక్కడే పట్టించుకోని గ్రామ సర్పంచ్
నవతెలంగాణ-దోమ
మండల పరిధిలోని అయినాపూర్ గ్రామంలో ఎనిమి దో వార్డులో ఎక్కడి సమస్యలు అక్కడే ములుగుతున్నాయి. కాలినీలో గుంతలమయమైన రోడ్డుపై నడిచేదెలా కాలినీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆరు నెలల కింద గ్రామ పంచాయతీలో ఫిర్యాదు చేస్తే సీసీరోడ్డు వేస్తా మని చెప్పి తీర్మానం చేశారన్నారు. అయినా ఆరు నెలల నుంచి సీసీరోడ్డు వేయడం మర్చిపోయారనీ వాపోతున్నా రు. వానాకాలం రావడంతో రోడ్డుపైన గుంతలు ఏర్పడి నీరు నిల్వ అలాగే ఉంటుందనీ, పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డా యని మొత్తం బురద అయిందన్నారు. అంతే కాకుండా కాల నీలో పిల్లలు, పెద్దలు మురికి నీరు వల్ల అనారోగ్యాల బారిన పడుతున్నారనీ తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పం దించి సీసీరోడ్డు వేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. గ్రామపంచాయతీ వాళ్ళను వెళ్లి తమ సమస్య గురించి అడిగితే స్పందించలేదనీ, నిర్లక్ష్యంగా సమాధానం చెప్తు న్నారనీ, అదేవిధంగా ఉన్న రోడ్డుని కూడా సీసీరోడ్డు వేస్తా మని తవ్వి వదిలేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గ్రామాభివృద్ధి పనుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న గ్రామ సర్పంచ్, అధికారులపై చర్యలు తీసుకొని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. గ్రామ అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై కాలనీ వాసులంతో జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేస్తామని తెలిపారు.