వన మహోత్సవానికి అంతా సిద్ధం..

Everything is ready for Vana Mahotsava..– 1,20, వేల మొక్కలు నాటడమే టార్గెట్ గా ముందుకు సాగుతున్న పనులు..
– ఒక్కో గ్రామపంచాయతీ పరిధిలో గల నర్సరీలో పదివేల మొక్కల పెంపు..

– మండల వ్యాప్తంగా రెండు లక్షల 50 వేల మొక్కలు పెంపు..
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
గ్రామాల్లో పచ్చదనం సంతరించుకునే విధంగా వనమహోత్సవానికి అధికారులు చకచకా ఏర్పాట్లు చేశారు. 2015 లో ప్రారంభమైన హరితహారం కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం వనమహోత్సవమని నామకరణం చేస్తూ గ్రామాల్లో వనమహోత్సవం పండగల నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నాగిరెడ్డిపేట మండల వ్యాప్తంగా 25 గ్రామపంచాయతీల పరిధిలో నర్సిల నర్సరీలను ఏర్పాటు చేసి గ్రామానికి పదివేల మొక్కలు అందించే విధంగా మొక్కలు పెంచారు మండల వ్యాప్తంగా రెండు లక్షల 50 వేలు మొక్కలు పెంచడం జరిగింది. మండలంలో ఖాళీ స్థలాలలో పాఠశాల ఆవరణలో రోడ్డుకు ఇరువైపులా నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు మండలంలో ఇప్పటికే 2015 నుండి దాదాపు ప్రకృతి వనాలలో మొక్కలను నాటడం జరిగింది. వర్షాలు కురియగానే గ్రామాలలో ప్రభుత్వ స్థలాలలో మొక్కలు నాటడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు.
ఇంటింటికి ఆరు మొక్కలు పంపిణీ..
వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఆయా గ్రామాలలో ఇంటింటికి ఆరు మొక్కల చొప్పున ప్రతి ఇంటికి మొక్కలను పంపిణీ చేసినట్లు ఏపీవో సాయిలు తెలిపారు. మండల వ్యాప్తంగా 30 వేల మొక్కలను పంపిణీ చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
1,20, వేల మొక్కలు నాటడమే లక్ష్యంగా..
నాగిరెడ్డిపేట మండల వ్యాప్తంగా 1,20, వేల  మొక్కలు నాటడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఏపీవో సాయిలు తెలిపారు. వర్షాలు కురియగానే గ్రామాలలో మొక్కలను నాటేందుకు ప్రాణాలికలు సిద్ధం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
25 గ్రామపంచాయతీలలో 2 లక్షల 50 వేల మొక్కలు పెంపు..
వనమహోత్సవానికి ఆయా గ్రామాలలో గ్రామపంచాయతీ పరిధిలో పదివేల మొక్కలు చొప్పున 25 గ్రామపంచాయతీ పరిధిలలో గల నర్సరీలలో రెండు లక్షల 50 వేల మొక్కలు సిద్ధం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
వర్షం కురవగానే మొక్కలు నాటడమే లక్ష్యం..
వనోమాహోత్సవానికి సంబంధించి ఆయా గ్రామాలలో ప్రభుత్వ స్థలాలలో గుంతలు ఏర్పాటు చేయడం జరిగిందని ఏపీవో సాయిలు తెలిపారు వర్షాలు కురిసిన వెంటనే మొక్కల కొరకు తీసిన గుంతలలో మొక్కలు వెంటనే నాటడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం తమకు ఇచ్చిన టార్గెట్ ను పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు.
Spread the love