– సీనియర్ సివిల్ జడ్జి యువరాజ్
నవతెలంగాణ-రెబ్బెన
ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ చేయడం చట్టరీత్యా నేరమని, యువత మాదకద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కన్వీనర్, సీనియర్ సివిల్ జడ్జి యువరాజ్ అన్నారు. మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ ప్రకాష్ అధ్యక్షతన నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యాసంస్థల్లో ర్యాగింగ్ చర్యలకు పాల్పడొద్దని, యువత గంజాయి, డ్రగ్స్‌కు బానిసై జీవితం నాశనం చేసుకోవద్దని తెలిపారు. కళాశాల సిబ్బంది విద్యార్థుల అలవాట్లను, నడవడికను గమనించాలన్నారు. తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం మొదటిసారి కళాశాలకు వచ్చిన సీనియర్ సివిల్ జడ్జిని సిబ్బంది ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జెండర్ స్పెషలిస్ట్ రాణి, న్యాయవాదులు శ్రీదేవి, వెంకటేశ్వర్, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.