
– ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్
నవతెలంగాణ-కంఠేశ్వర్ : ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ మాజీ విప్ ఈరవత్రి అనిల్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొదట కార్యకర్తలకు కొండంత ధైర్యం ఈరవత్రి అనిల్ ఇచ్చారు ఈ వేడుకలను ఎన్ఎస్ఈ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వేణురాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కాంగ్రెస్ భవన్ లో ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ మాజీ విప్ ఈరవత్రి అనిల్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.ముందుగా ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ కేక్ కట్ చేసి ఈరవత్రి అనిల్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అనంతరం నిజామాబాద్ జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వేణు రాజు మాట్లాడుతూ..నీతి,నిజాయితీకి,ని బద్ధతకు మారుపేరు కార్యకర్తలకు కొండంత ధైర్యం ఈరవత్రి అనిల్ ని, ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్ ఉన్నప్పుడు బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ఆయన గుర్తు చేశారు. గత తొమ్మిది సంవత్సరాలుగా పార్టీ అధికారంలోకి లేకున్నా అనుక్షణం ప్రజల్లో ఉంటూ ప్రజల కష్టనష్టాలు తెలుసుకుంటూ ప్రజా సమస్యలపై అభివృద్ధిపై అధికార పార్టీని ప్రశ్నిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న నాయకుడు అనిల్ అని ఆయన అన్నారు. నాలాంటి ఎంతోమంది యువకులను రాజకీయంగా ప్రోత్సహిస్తూ వెన్ను తట్టి ముందుకు నడిపిస్తున్న మా నాయకుడు అనిల్ అని ఆయనే ఎల్లప్పుడూ మాకు స్ఫూర్తి అని ఆయన అన్నారు. ఆపదలో ఉన్న కార్యకర్తలు అన్నా అంటే నేనున్నా అంటూ కష్ట కాలంలో వారిని ఆదుకుంటూ రానున్న ఎన్నికల్లో అధికారం మనదే అంటూ భరోసా ఇస్తూ కార్యకర్తలకు మనోధైర్యాన్ని నింపుతూ పార్టీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నాయకుడు ఈరవత్రి అనిల్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని రేపు రాష్ట్రంలో ఏర్పడబోయే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆయన ఉన్నత పదవులు పొందాలని ఆశిస్తూ మా నిజామాబాద్ జిల్లా ఎన్.ఎస్.యు.ఐ కమిటీ తరఫున ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్దార్ నరేందర్ సింగ్, అవిన్,శోభన్,సలీం, ఎన్.ఎస్.యు.ఐ జిల్లా నాయకులు శివ, సునీల్, ఉదయ్, రాహుల్, రోహిత్, తదితరులు పాల్గొన్నారు.