రైలు ప్రమాద బాధితులకు రైల్వే శాఖ ఎక్స్ గ్రేషియా ప్రకటన..

నవతెలంగాణ – కోల్ కతా: పశ్చిమబెంగాల్‌లోని రైలు ప్రమాద బాధితులకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్‌ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ దుర్ఘటనలో మృతిచెందిన కుటుంబసభ్యులకు  రూ.10లక్షల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు వెల్లడించారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్‌’లో పోస్ట్‌ పెట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడినవారికి రూ.2.5 లక్షలు, స్వల్పగాయాలైన వారికి రూ.50వేలు చొప్పున ఇస్తామని తెలిపారు. సోమవారం ఉదయం దార్జిలింగ్ జిల్లాలో సీల్దా నుంచి వెళ్తున్న కాంచన్‌జంఘా ఎక్స్‌ప్రెస్‌ను ఓ గూడ్స్‌ రైలు ఢీకొన్న దుర్ఘటనలో 15 మంది ప్రయాణికులు దుర్మరణం పాలవగా.. 60 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.

Spread the love