రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి మృతి

నవతెలంగాణ – గుజరాత్‌: గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలోని సావర్‌కుండ్లా పట్టణం సమీపంలో కారు బుల్‌డోజర్‌ను ఢీకొనడంతో గుజరాత్‌ మాజీ వ్యవసాయ మంత్రి వల్లభ్‌భాయ్ వాఘాసియా మరణించినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. ఈ ప్రమాదం గురువారంరాత్రి 8.30 గంటల సమయంలో ప్రమాదం జరిగింది అయనతో పాటు వాహనంలో ఉన్న ఒకరికి గాయాలయ్యాయ వంద పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం గురించి తెలుసుకున్న పార్టీ నాయకులు, ఆయన మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. సావర్కుండ్లా అసెంబ్లీ స్థానం నుండి మాజీ ఎమ్మెల్యే వఘాసియా, విజయ్ రూపానీ ప్రభుత్వం మొదటి టర్మ్‌లో వ్యవసాయం, పట్టణ గృహనిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు.

 

Spread the love