మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి మృతి

మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి మృతి– అంత్యక్రియలకు హాజరైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు
నవతెలంగాణ -జడ్చర్ల
బీఆర్‌ఎస్‌ పార్టీ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతారెడ్డి సోమవారం రాత్రి మృతిచెందగా.. మంగళవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచలో అంత్యక్రియలు నిర్వహించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చైన్నరులో చికిత్స పొందారు. పరిస్థితి విషమించి మృతిచెందారు. బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, నేతలు నివాళులర్పించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే హరీశ్‌రావును చూడగానే లక్ష్మారెడ్డి బోరున విలపించారు. ఆయనను హరీశ్‌రావు ఓదార్చారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, ఎంపీలు ఈటల రాజేందర్‌, డీకే అరుణ, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాజేష్‌ రెడ్డి, అనిరుద్‌ రెడ్డి, వాకిటి శ్రీహరి, కసిరెడ్డి నారాయణరెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్‌, గంగుల కమలాకర్‌, ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి, రాజేందర్‌ రెడ్డి, గువ్వల బాలరాజ్‌, రాష్ట్ర సంగీత అకాడమీ మాజీ చైర్మెన్‌ శివకుమార్‌ తదితరులు నివాళులు అర్పించారు.

Spread the love