వైసీపీకి మాజీ మంత్రి రాజీనామా..

నవతెలంగాణ – అమరావతి: వైసీపీకి మాజీ మంత్రి శిద్దా రాఘవరావు రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షుడు జగన్‌కు తన రాజీనామా లేఖను పంపారు. వ్యక్తిగత కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన లేఖలో వివరించారు. శిద్దా తనకు పూర్వ పరిచయాలున్న దర్శి నుంచే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి మొగ్గుచూపినా వైసీపీ అధిష్ఠానం పట్టించుకోలేదు. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Spread the love