నవతెలంగాణ – నసురుల్లాబాద్
రైతుల ముఖాల్లో ఆనందం చూడడమే నా చిరకాల స్వప్నమని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీ నివాస్ రెడ్డి అన్నారు. సోమవారం నసురుల్లా బాత్ మండలం అంకోల్ తండా ఎంపీటీసీ భర్త సవాయి సింగ్, గ్రామ రైతులతో ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ నేడు చివరి ఆయకట్టు రైతుల కోసం సాగునీటి అధికారులు నిజాంసాగర్ నీరు విడుదల చేశారని అందుకు రైతులు సాగునీటిని సద్వినియోగం చేసుకొని పొదుపుగా వాడుకోవాలన్నారు. ఈ సందర్భంగా అంకుల్ తాండ కు చెందిన కొందరు రైతులు మాట్లాడుతూ నిజాంసాగర్ ఆయకట్టు కింద ఉన్న ఆయకట్టు భూముల్లో సాగు అవుతున్న వరి పంట పొట్ట దశలో ఉందని అందుకు అనుగుణంగా సాగునీరు విడుదల చేయాలని ఎమ్మెల్యేని కోరగా. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రైతులు సాగునీటిని పొదుపుగా వాడుకోవాలని, పంటలకు ఎంత అవసరముంటే అంతే ఉప యోగించుకోవాలని, వృథా చేయరాదని ఎమ్మెల్యే పోచారం అక్కడ ఉన్న రైతులకు సూచించారు. ఒక్క చుక్క కూడా నీరు వృథా పోరాదన్నారు. ఎప్పటికప్పుడు అధికా రులు కెనాల్ కట్టపై పర్యటించి వివరాలు తె లుసుకోవాలన్నారు. రబీ పంటకు ఒక్క గుంట కూడా ఎండకుండా సాగునీటిని తీసుకుని రావడమే లక్ష్యంగా ప్రభుత్వానికి, అధికారులకు విన్నవించగానే సాగునీటి విడుదలకు సుముఖంగా స్పందించడంతో నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి సాగునీటిని విడుదల చేయడం జరిగిందని, ప్రభుత్వానికి, అధికారులకు ప్రత్యేక కృ తజ్ఞతలు తెలిపారు. చిన్నపాటి ఆపరేషన్ వల్ల గత వారం రోజులుగా హైదరాబాదులో ఉండవలసి వచ్చిందని, మరో రెండు రోజుల్లో హైదరాబాద్ నుండి బాన్సువాడ కు వస్తున్నానని ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని రైతులను సూచించారు.