
– సర్పంచ్ నుండి స్పీకర్ గా ఎదిగిన మహానేత
– జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పికర్ స్వర్గీయ దూదిళ్ళ శ్రీపాదరావు.జయంతి వేడుకలను కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన వేడుకులలో ట్రైనీ ఎస్.పి.రాజేష్ మీనా తో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు ఆర్పించిన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వర్గీయ శ్రీపాద రావు న్యాయువాదిగా ప్రజలకు మంచి సేవలు అందించారాని,తన రాజకీయ ప్రస్థానంలో మొదటిగా సర్పంచ్ గా రెండు సార్లు ఎన్నికై తదుపరి మహాదేవాపూర్ సమితి అధ్యక్షుడిగా ఎన్నికైనారని అన్నారు.1984 ఎన్నికలలో మొదటి సారిగా మంథని నుండి శాసన సభ్యులుగా పోటీ చేసి విజయం సాధించి 3 సార్లు శాసన సభ్యునిగా ఎన్నికైనారు అని అన్నారు.నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకున్న శ్రీపాద రావు ప్రజల మన్ననులు ఎన్నో పొందారని అన్నారు.శాసన సభ స్వీకర్ గా అన్ని పార్టీల మద్దతుతో పదవిని అధిష్టించి ఆ పదవికి ఎంతో వన్నె తెచ్చారాన్ని ఈ సందర్బంగా ఆయన సేవలను కొనియాడినారు. ఒక ప్రక్క స్వీకర్ గా విధులు నిర్వహిస్తూ తన మంథని నియోజకవర్గ అభివృద్ధిని అన్ని రంగాలలో ముందు ఉంచారని పేర్కొన్నారు.1994 లో ఓటమి పాలు అయినప్పటికీ ప్రజల మధ్యనే ఉంటూ ఎన్నో సేవలు అందించడం అలాగే1999 ఏప్రియల్ 13 న మహాదేవపూర్ మండలం అన్నారం వెళ్లి వచ్చే అటవీ మార్గంలో ఆయన మృత్యువు నక్సల్స్ రూపంలో విగత జీవిని చేసిందని ఈ సంఘటన రాష్ట్రాన్ని కుదిపివేసిందని కలెక్టర్ ఈ సందర్బంగా అన్నారు.ఈ కార్యక్రమం లో జడ్పీ సీఈవో వి వి అప్పారావు, డి ఆర్ డి ఎ పి డి మధుసూదన్ రాజు, డి టి డి ఓ శంకర్, డీఈవో ఆశోక్, జియం ఇండస్టిస్ సితారాం, డియస్ఓ మోహన్ బాబు, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి దున్న శ్యామ్, జిల్లా అధికారులు, వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.