హోరెత్తించిన అగ్రనేతలు

– సుడిగాలి పర్యటనలు.. సందించిన విమర్శనాస్త్రాలు
– 11 నియోజకవర్గాల్లో కేసీఆర్‌ ప్రజా ఆశీర్వాద సభలు
– కేటీఆర్‌, హరీశ్‌రావు రోడ్‌షోలు కాంగ్రెస్‌ నేతలు రాహులు, ప్రియాంక, రేవంత్‌రెడ్డి
– మోడీ, అమిత్‌ షా, నడ్డా, యోగీ బీఎస్పీ అథినేతలు మాయావతి, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌
నవతెలంగాణ -మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
వివిధ పార్టీల అగ్రనేతలు ఎన్నికల ప్రచారాన్ని హౌరెత్తించా రు. సుడిగాలి పర్యటనలు చేసి అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేశారు. గెలిపిస్తే ఏం చేయబోతు న్నామో చెప్పడమే కాకుండా ప్రత్యర్థి పార్టీలపై విమర్శనాస్త్రాలు సంధించా రు. పాత కొత్త హామీలు…అవినీతి, అసమర్ధ వంటి ఆంశాలు ప్రచారంలో చర్చకు పెట్టారు. పార్టీ ప్రకటించిన ఎన్నికల మ్యానిపెస్టోను వివరించడంతో పాటు ఇతర పార్టీల మ్యానిపెస్టోల లోపాల్ని ఎత్తిచూపేందుకు ప్రయత్నిం చారు. ఎన్నికలతఅధినేతలు ఎన్నికల ప్రచారాన్ని హౌరెత్తించారు. సంగారె డ్డి, మెదక్‌, సిద్దిపేట జిల్లాల్లోని 11 అంసెబ్లీ నియోజకవార్గల్లోనూ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ, బీఎస్పీ అగ్రనేతలు ఎన్నికల ప్రచారం చేశారు. పటాన్‌చె రులో పోటీ చేస్తున్న సీపీఐఎం అభ్యర్థి ప్రచారంలో ఆ పార్టీ జాతీయ నాయకులు పాల్గొన్నారు.
11 చోట్ల కేసీఆర్‌ ప్రజా ఆశీర్వాద సభలు
మూడో సారి గెలిచి తీరాలనే పట్టుదలతో కేసీఆర్‌ అన్ని నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మూడు జిల్లాల్లోని 11 నియోజకవర్గాల్లోనూ బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు కోసం ప్రజా ఆశీర్వాద సభల పేరిట భారీ బహిరంగ సభలు జరిపారు. సెంటిమెంట్‌గా కలిసొచ్చిన హుస్నాబాద్‌ నుంచే కేసీఆర్‌ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వేలాది మందితో నిర్వహించిన సభలో సతీష్‌ను గెలిపంచాలని కోరారు. సిద్దిపేటలో హరీశ్‌రావు గెలుపు కోసం జరిపిన సభకు కేసీఆర్‌ హాజరయ్యారు. మెదక్‌లో పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్‌లో సునీతాలక్ష్మారెడ్డి, నారాయణఖేడ్‌లో మహారెడ్డి భూపాల్‌రెడ్డి, పటాన్‌చెరులో గూడెం మహిపాల్‌రెడ్డి, జహీరాబాద్‌లో మాణిక్యరావు, దుబ్బాకలో కొత్త ప్రభాకర్‌రెడ్డి గెలుపు కోసం నిర్వహించిన
సభల్లో కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. సోమవారం సంగారెడ్డి, అందోల్‌ నియోజకవర్గాల్లో జరిపే సభలకు హాజరుకానున్నారు. చివరిగా తాను పోటీ చేస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలో జరిపే సభకు హాజరుకానున్నారు. ఆ పార్టీ తరపున మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులు కూడా అనేక నియోజకవర్గాల్లో రోడ్‌షో సభలకు హాజరై ప్రసంగాలు చేశారు. ముగ్గురు నేతలు కూడా కాంగ్రెస్‌ వైఫల్యాలు, బీజేపీ మతోన్మాదం గురించి విమర్శలు చేశారు. బీఆర్‌ఎస్‌ చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించి చెప్పి ఓట్లడిగారు. మోడీ, రాహుల్‌ గాంధీ, రేవంత్‌రెడ్డి వంటి నాయకుల్ని సైతం విమర్శించారు. సభలు, రోడ్‌షోలు బీఆర్‌ఎస్‌లో జోష్‌ను పెంచాయి.
ప్రచారంలో కాంగ్రెస్‌ అగ్ర నేతలు
కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుపు కోసం ఆ పార్టీ అగ్రనేతలు ప్రచార సభల్లో పాల్గొన్నారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్‌ ఖర్గే సంగారెడ్డి, మెదక్‌లో జరిపిన విజ యభేరి సభల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత హుస్నాబాద్‌లో ప్రియాంక గాంధీ, సంగారెడ్డి, అందోల్‌లో రాహుల్‌ గాంధీ ప్రచారం చేశారు. టీపీసీసీ నేత రేవంత్‌రెడ్డి సైతం గజ్వేల్‌, నారాయణఖేడ్‌, పటాన్‌చెరు, దుబ్బాక, నర్సాపూర్‌ నియోజకవర్గాల్లో విజయభేరి సభలకు హాజరయ్యారు. బీఆర్‌ఎస్‌ వైఫల్యాలు, కేసీఆర్‌ కుటుంబ అవినీతి, అక్రమాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. బీజేపీపై కూడా రాహులు, ప్రియాంక ఘాటైన విమర్శలు చేశారు. అగ్రనేతలు ప్రచారానికి రావడంతో అభ్యర్థులకు గెలుపు పట్ల భరోసా వచ్చిందంటున్నారు. కాంగ్రెస్‌ శ్రేణుల్లోనూ ఉత్సహాం నింపారు.
మోడీ, అమిత్‌షా, నడ్డా, యోగి సభలు
బీజేపీ సైతం బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌కు పోటీగా సభలు నిర్వహిస్తుంది. గజ్వేల్‌లో ఈటెల రాజేందర్‌ గెలుపు కోసం ప్రధాన మంత్రి మోడీ వచ్చి ప్రచారం చేశారు. తూప్రాన్‌లో జరిగిన సభకు హాజరయ్యారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా సైతం సంగారెడ్డి ప్రచార సభలో పాల్గొన్నారు. అమిత్‌ షా పటాన్‌చెరు సభకు హాజరయ్యారు. దుబ్బాక, నర్సాపూర్‌లోనూ జాతీయ నాయకులు ప్రచారం చేయనున్నారు. కాళేశ్వరం అవినీతి, కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎత్తిచూపారు. అభ్యర్థుల్లో జోష్‌ నింపేందుకు ముఖ్య నేతలు ప్రయత్నించారు.
బీఎస్పీ ప్రచారానికి మాయావతి
పటాన్‌చెరు బీఎస్పీ అభ్యర్థి నీలం మధు గెలుపు కోసం ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి రానున్నారు. రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ సైతం పలు చోట్ల ప్రచారం చేస్తున్నారు. చాలా చోట్ల బలమైన అభ్యర్థులు లేకపోవడంతో సభలు జరపట్లేదు.
పటాన్‌చెరులో సీపీఐఎం నేతల ప్రచారం
పటాన్‌చెరులో పోటీ చేస్తున్న సీపీఐఎం అభ్యర్థి జె.మల్లిఖార్జున్‌ గెలుపు కోసం ఆ పార్టీ జాతీయ నేతలు కూడా ప్రచారం చేస్తున్నారు. కార్మిక వాడగా ఉన్న పటాన్‌చెరులో సీపీఐఎం జాతీయ నాయకులు సాయిబాబు, పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘువులు పలుమార్లు సభల్లో పాల్గొన్నారు.

Spread the love