ఆశా వర్కర్లకు ఎగ్జాము వెంటనే రద్దు చేయాలి..

– పారితోషికాలను రూ.18,000/-లకు పెంచాలి
నవతెలంగాణ-దుబ్బాక రూరల్
ఆశ వర్కర్ల కు పెడుతున్న ఎగ్జామ్ రద్దు చేయాలని  సీఐటీయూ దుబ్బాక టౌన్ కన్వీనర్ కొంపెల్లి  భాస్కర్ డిమాండ్  చేశారు. సిద్దిపేట  జిల్లా దుబ్బాక మండలం  సోమవారం  రామక్కపేట పీహెచ్సిలో సీఐటీయూ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కొంపల్లి భాస్కర్ మాట్లాడుతు తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్లు గత 32 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారని ప్రారంభం నుండి ఇప్పటివరకు ప్రభుత్వం నిర్వహించిన అనేక ట్రైనింగ్లు పొందారన్నారు.ఇంత సీనియారిటీ ఉన్న ఆశా వర్కర్లను కొత్తగా ఎగ్జామ్ నిర్వహిస్తామని,ఎగ్జామ్ లో ఉత్తీర్ణత సాదిస్తేనే ఆశా వర్కర్స్ సర్టిఫికెట్ ఇస్తామని, ఫెయిల్ అయితే ఆశాలను విధుల నుండి తొలగిస్తామని ప్రభుత్వం చెప్పడం అన్యాయమన్నారు.ఇది ఆశాలను కించపరచడంతో పాటు ఆశాల సీనియారిటీని తగ్గించి, ఉద్యోగ భద్రత లేకుండా చేయడం తప్ప మరొకటి కాదని ఈ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.రిజిస్టర్స్ రాయడం, సర్వేలు చేయడం, ఆన్లైన్ పని చేయడం, బిపి, షుగర్స్, థైరాయిడ్ తదితర అన్నిరకాల జబ్బులను గుర్తిస్తు  ప్రభుత్వం సప్లై చేస్తున్న మందులను ప్రజలకు అందజేస్తున్నా కనీస వేతనాలు అమలు చేయకుండా ఆశాలను మాసం చేస్తుందని అన్నారు. డబ్ల్యుహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ గ్లోబల్ లీడర్స్ అని ఆశా వర్కర్లకు అవార్డును ఇచ్చారని తెలిపారు. పారితోషికాలు లేని అనేక పనులను ప్రభుత్వం ఆశాలతో చేయిస్తున్నదని ప్రతిరోజు ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు సబ్ సెంటర్స్, బస్తీ దవాఖానాల్లో పని చేయాలని ఆశాలకు ప్రభుత్వం చెప్తున్నది. ఇంత పని చేస్తున్న ఆశాలకు కేవలం రూ.9,750/-లు పారితోషికాలు మాత్రమే ప్రభుత్వం చెల్లించడం అన్యాయం అన్నారు. మరొకవైపు నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా  ఆశాల పారితోషికాలను రూ.18,000/-లకు పెంచి ఫిక్సిడ్ వేతనం నిర్ణయించాలని, డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆషా వర్కర్స్ మంజుల,శ్యామల, భారతీ,సుజాత, దేవలక్ష్మి,వసంత,సుమమలత, కనకవ్వ, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.
Spread the love