స్టడీసర్కిల్‌లో సివిల్స్‌ కోచింగ్‌ ఎంపికకు 9న పరీక్ష

– నేటినుంచే హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ : డైరెక్టర్‌ శ్రీధర్‌
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్‌
షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖకు చెందిన రాష్ట్ర స్టడీ సర్కిల్‌లో సివిల్స్‌ ప్రిలిమినరీ మెయిన్స్‌ (పది నెలల రెసిడెన్షియల్‌) కోచింగ్‌ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు బుధవారం నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు అవకాశమున్నది. ఈ మేరకు స్టడీసర్కిల్‌ డైరెక్టర్‌ శ్రీధర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 3405 మంది అర్హులైన అభ్యర్థు లు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఈనెల తొమ్మిదిన ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వర కు రాతపరీక్షను నిర్వహిస్తామని పేర్కొ న్నారు. హైదరాబాద్‌లోని సికింద్రా బాద్‌ సర్దార్‌పటేల్‌ రోడ్‌లోని యూనివ ర్సిటీ పీజీ కాలేజీ, దోమల్‌గూడలోని ఏవీ కాలేజి, నాంపల్లిలోని సరోజినీ నాయుడు వనితా మహావిద్యాలయ, కోఠీలోని మహిళా కాలేజీతోపాటు వరంగల్‌ సుబే దారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల, నిజామాబాద్‌లోని ప్రభు త్వ గిరిరాజ్‌ కాలేజీలో పరీక్ష ఉంటుందని వివరించారు. వంద ప్రశ్నలు కలిగిన జనరల్‌ స్టడీస్‌ పరీక్ష, 40 ప్రశ్నలు కలిగిన సీ-శాట్‌ పరీక్ష మొత్తం 140 ప్రశ్నలకు ఈ పరీక్షను మూడు గంటల సమయంలో నిర్వహిస్తా మని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లోకి ఉదయం పది నుంచే అనుమతిస్తారని పేర్కొన్నారు. ఓఎంఆర్‌ జవాబు పత్రాల గడులను నిం పేందుకు బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్నును అభ్యర్థులు తెచ్చుకో వాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్‌టికెట్ల ను డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు స్టడీసర్కిల్‌ వెబ్‌సైట్‌ షష. ్‌రర్‌బసyషఱతీషశ్రీవ.షశీ.ఱఅను సంప్రదించాలని కోరారు.

Spread the love