పరీక్ష పేపర్ల లీకేజీల ప్రభుత్వాన్ని ఓడించాలి

– కేసీఆర్‌ బినామీ భట్టిని ఓడించాలి
– బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులకు బుద్దిచెప్పాలి
– ఉదయించే ఉద్యమాల సూర్యుడు పాలడుగు భాస్కర్‌ని గెలిపించాలి
– సిఐటియు ఆల్‌ ఇండియా కోశాధికారి సాయిబాబు పిలుపు
నవతెలంగాణ -ఎర్రుపాలెం
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు కోచింగ్‌ సెంటర్లకు వెళ్లి కష్టపడి చదువుకొని ఉద్యోగాలు సంపాదించాలనే ఆశతో పరీక్షలు రాస్తే పరీక్ష పేపర్లను లీకేజీ చేసిన ప్రభుత్వాన్ని ఓడించాలని, శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలు అవకాశం ఇస్తే తాను పోషించవలసిన పాత్రను పోషించకుండా కెసిఆర్‌కి బినామీగా వ్యవహరిస్తున్న భట్టి విక్రమార్కుని ఈ ఎన్నికలలో ఓడించాలని సిఐటియు ఆల్‌ ఇండియా కోశాధికారి సాయిబాబు ఓటర్లకు పిలుపు నిచ్చారు. మండల కేంద్ర మైన ఎర్రుపాలెం రామిశెట్టి పుల్లయ్య భవనం నందు జరిగిన విలేకరుల సమావేశంలో సాయిబాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జరిగే 119 శాసనసభ ఎన్నికలలో కార్మిక రైతాంగ ప్రజా సమస్యల పరిష్కారం ప్రాతిపదికపైన ప్రజలు తీర్పు నివ్వాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేని బిఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని మూడోసారి జరిగే ఎన్నికలలో చిత్తుగా ఓడించి తిరస్కరించాలని అన్నారు. పలు కార్మిక సంఘాలు నెలల తరబడి సమ్మె చేస్తుంటే వారితో చర్చలు జరపవద్దని కెసిఆర్‌ హుకుం జారీ చేశారని, యూనియన్‌ నాయకులు రాకుండా ప్రగతి భవనం తలుపులు మూసి వేశారని అన్నారు. సమ్మె బాట పట్టిన కార్మికులను ఉద్యోగాల నుండి తొలగించారని పలు సంఘాల యూనియన్లకు వ్యతిరేకంగా నిరంకుశ నియంత పరిపాలనను అంతమొందించాలని అన్నారు. కాంటాక్ట్‌ ఉద్యోగుల వ్యవస్థను రద్దు పరుస్తానని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పిన కేసీఆర్‌ కొత్త ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులకు ద్రోహం చేశారని విమర్శించారు. కొనసా గుతున్న సబ్సిడీలను ఎత్తివేసి గ్యాస్‌ సిలిండర్‌ ధరలు 1200 రూపాయలకు పెంచి ఎన్నికల సమయంలో 500 రూపాయలకు గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తానని చెబుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోడీ పెద్ద దొంగ అని, కెసిఆర్‌ చిన్న దొంగ అని దొందు దొందే అన్నారు. రేషన్‌ కా ర్డులు ఇవ్వడం చేతకాని వాడు సన్న బియ్యం ఇస్తాన ని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను ఓడించి ప్రజా సమస్యల పైన వెలుగేత్తి పోరాడే పాలడుగును గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో సిఐటియు సీనియర్‌ నాయకులు రాజారావు, రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు, జిల్లా రైతు సంఘం నాయకులు దివ్వెల వీరయ్య, మండల సిఐటియు ఆర్గనైజర్‌ సగుర్తి సంజీ వరావు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి గామాసు జోగయ్య, వృత్తిసంఘం నాయకులు నాగులవంచ వెంకటరామయ్య, కోటి సుబ్బారెడ్డి తదిత రులు పాల్గొన్నారు.

Spread the love