అద్భుతమైన యాక్షన్‌ సినిమా

Excellent action movieయాక్షన్‌ స్టార్‌ సిల్వెస్టర్‌ స్టాలోన్‌ ప్రధాన పాత్ర పోషించిన ఎక్స్‌పెండబుల్స్‌-4 విడుదలకు సిద్ధమైంది. ఈ ఎక్స్‌పెండబుల్‌ సిరీస్‌ డేవిడ్‌ కల్లాహం సష్టించిన పాత్రల ఆధారంగా, అలాగే స్పెన్సర్‌ కోహెన్‌, విమ్మర్‌, డాగర్‌హార్ట్‌ కథ ఆధారంగా, కర్ట్‌ విమ్మర్‌, టాడ్‌ డాగర్‌హార్ట్‌, మాక్స్‌ ఆడమ్స్‌ స్క్రీన్‌ ప్లే నుండి స్కాట్‌ వా దర్శకత్వం వహించిన అమెరికన్‌ యాక్షన్‌ చిత్రమిది. ఇది ‘ది ఎక్స్‌పెండబుల్స్‌ 3’కి సీక్వెల్‌. ఈ సినిమా ఇంగ్లీష్‌, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఈనెల 22న విడుదల కానుందని పివిఆర్‌ పిక్చర్స్‌ తెలియజేసింది. ఈ చిత్రానికి మల్టీవిజన్‌ మల్టీమీడియా ఇండియా ప్రై. లిమిటెడ్‌ సమర్పణ. యుఎస్‌ఎ, రష్యా మధ్య యుద్ధాన్ని నివారించడానికి, డేర్‌-డెవిల్‌ ది ఎక్స్‌పెండబుల్స్‌ జట్టు- నిరోధించే అద్భుతమైన మిషన్‌తో ఈ చిత్రం సాగుతుంది. సుర్టో రహ్మత్‌ (ఇకో ఉవైస్‌) నేతత్వంలోని ఉగ్రవాద సంస్థ లిబియాలోని రసాయనాల కర్మాగారం నుండి అణు క్షిపణి డిటోనేటర్లు ధనికులకు అమ్ముతారు. రెండు సూపర్‌ పవర్స్‌, ఎక్స్‌పెండబుల్స్‌ బదం రంగంలోకి దిగి ముందుకు సాగుతుంది. సిల్వెస్టర్‌ స్టాలోన్‌, జాసన్‌ స్టాథమ్‌, డాల్ఫ్‌ లండ్‌గ్రెన్‌, మేగాన్‌ ఫాక్స్‌, జాక్సన్‌, టోనీ జా, ఐకో ఉవైస్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ-టిమ్‌ మారిస్‌-జోన్స్‌, సంగీతం-గ్విలేమ్‌ రౌసెల్‌.

Spread the love