రూ.20లక్షల విలువైన డ్రగ్స్‌ను స్వాదీనం ఎక్సైజ్‌ పోలీసులు

నవతెలంగాణ-హైదరాబాద్ : ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్‌ను గుట్టు చప్పుడు కాకుండా తీసుకువచ్చి ఈ వెంట్‌ నిర్వా హకులతో పాటు ఐటీ ఉద్యోగులకు అమ్మకాలు చేస్తున్న ముఠాను శంషాబాద్‌ ఎక్సైజ్‌ పోలీసులు పట్టుకున్నారు. ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ దేవేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన తృప్తి ప్రభాకర్‌ హోకం(21), మధ్య ప్రదేశ్‌కు చెందిన అనుభవ్‌ సక్సేనా (24) హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ఈవెంట్‌ నిర్వాహకులకు డ్రగ్స్‌ను విక్రయిస్తున్నారు.  సమాచారం అందుకున్న పోలీసులు బండ్లగూడ జాగీర్‌ సన్‌సిటీ మోర్‌ సూపర్‌ మార్కెట్‌ వద్ద వారిని అదుపులోకి తీసుకుని 270 గ్రాముల ఎండీఎంఏ మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.20లక్షల వరకు ఉంటుందని తెలిపారు. వారిని విచారించగా చంద్రపూర్‌ కు చెందిన సాబర్‌ అనే వ్యక్తి నుంచి కోరియర్‌ ద్వారా తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు వారు తెలిపారు. ఇద్దరిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

Spread the love