నవతెలంగాణ – బెజ్జంకి
వరంగల్ జిల్లా మహబూబాబాద్ కేససముద్రంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్ 17 కబడ్డీలో మండల కేంద్రంలోని ఆదర్శ విద్యాలయ విద్యార్థులు రాణించినట్టు పీడీ కనుకారెడ్డి శనివారం తెలిపారు. విద్యార్థులు ఎల్.రేణుకా, ఎస్.కృష్ణవేణి, కే.శరణ్య, ఎల్.గణేశ్, ఎల్.సాయిచరణ్, టీ.రాంచరణ్,ఏ. రుత్వీక్ అండర్ 17 కబడ్డీలో పాల్గొని రాణించారని పీడీ తెలిపారు. విద్యార్థులను విద్యాలయ భోధన సిబ్బంది అభినందించినట్టు పీడీ తెలిపారు.