రాజధాని రుణం రాష్ట్ర వాటాలో మినహాయింపు

Exemption from State's share of capital debt– కేంద్రం నిర్ణయం
– తొలి విడతగా మూడువేల కోట్లు విడుదల
అమరావతి : అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రపంచబ్యాంకు ద్వారా ఇప్పిస్తున్న రూ.15 వేల కోటను రాష్ట్ర వాటా నిధుల నుండి కేంద్ర ప్రభుత్వం మినహాయించనుంది. ఈ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఏటా బడ్జెట్లోనే మినహాయింపులను చూపాలని ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. నిధులకు కౌంటర్‌ గ్యారంటీ ఇచ్చిన కేంద్రం ఏడాది వాటాతోపాటు, వడ్డీని కూడా ప్రపంచబ్యాంకకు చెల్లించేందుకు బాధ్యత తీసుకుంది. అయితే ఈ మొత్తాన్ని రాష్ట్ర వాటాగా ఇచ్చే నిధుల నుండే చెల్లించనుంది. ఈ మేరకు ప్రాథమిక అంగీకారం కుదిరినట్లు తెలిసింది. దీనిలో భాగంగా ఇప్పటికే రూ.3000 కోట్లును కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది.దీంతో వచ్చేనెల మొదటి వారంలోనే రైతులకు కౌలు చెల్లించనున్నారు. ఈవారంలో రాజధాని పరిధిలో ప్రపంచబ్యాంకు బృందం పర్యటలను పూర్తి చేసుకోనునుంది. అప్పటి వరకూ రైతుల నుండి ఎటువంటి అభ్యంతరాలు లేకుండా చూసేందుకు మున్సిపల్‌ పట్టణాభివృద్దిశాఖ మంత్రి నారాయణ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. రైతులను పిలిపించి మాట్లాడారు. ప్రపంచబ్యాంకు పర్యటిస్తున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులూ లేకుండా చేసుకోవాలని, లేనిపక్షంలో ఇబ్బందులు ఎదురవుతాయని మంత్రి సిఆర్‌డిఏ అధికారులకు సూచించగా దానికి అనుగుణంగావారు కూడా చర్యలు తీసుకుంటున్నారు. 2016-19 మధ్యలో ప్రపంచబ్యాంకు సభ్యులు వస్తే రైతులను పిలిచించి మాట్లాడిన ఫ్రభుత్వం ప్రస్తుతం అటువంటి చర్యలు తీసుకోలేదు. పర్యటన మొత్తం గుంభనంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ప్రపంచబ్యాంకు నిధులు రూ.15 వేల కోట్లు వచ్చేలోపు ముందే కొంత మొత్తాన్ని కేంద్రం రాష్ట్రానికి కేటాయించనుంది. వాస్తవంగా కనీసం మూడు నుండి ఐదేళ్లలోపు నిధుల తిరిగి చెల్లింపులకు మారటోరియం ఉంటుంది. నిధులు ఇచ్చిన తరువాత వాటిని ఉపయోగించుకోవడం, దాని ద్వారా ఆదాయం సందించుకోవడం కోసం ఈ మారటోరియం విధిస్తారు. మారటోరయం తరువాత చెల్లింపుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు బడ్జెట్లోనే తగ్గింపులు చూపించేలా రాష్ట్రంతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది.

Spread the love